క్రీడాభూమి

వచ్చే నెలలో నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: వచ్చేనెల శ్రీలంక టూర్‌కు టీమిండియా వెళ్లనుండగా, ఈలోపే కొత్త కోచ్ ఎంపిక ప్రక్రియ పూర్తవుతుందని బిసిసిఐ తాత్కాలిక అధ్యక్షుడు సికె ఖన్నా బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపాడు. కోచ్ ఎంపికకు ప్రక్రియ కొనసాగుతున్నదని, త్వరలోనే సిఎసి ఒక నిర్ణయం తీసుకుంటుందని తెలిపాడు. కోచ్ అనిల్ కుంబ్లే, కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య విభేదాలు ఉన్నాయన్న విషయాన్ని అతను పరోక్షంగా అంగీకరించాడు. సమస్యను పరిష్కరించడానికి తాము శక్తివంచన లేకుండా ప్రయత్నించామని, కానీ, సత్ఫలితాన్ని రాబట్టలేకపోయామని పేర్కొన్నాడు. ఆ సమస్య ఏమిటనేది అతను స్పష్టం చేయకపోయినప్పటికీ, అది కుంబ్లే, కోహ్లీ మధ్య తలెత్తిన వివాదమేనన్నది అందరికీ తెలిసిన వాస్తవం. ఇలావుంటే, మరికొన్ని దరఖాస్తులను స్వీకరిస్తామని బిసిసిఐ సీనియర్ అధికారి రాజీవ్ శుక్లా మరో ప్రకటనలో తెలిపాడు. వివరాలు త్వరలోనే తెలుస్తాయని పేర్కొన్నాడు. కొత్తగా ఎన్నికైన కోచ్ 2019లో జరిగే ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ పూర్తయ్యే వరకూ పదవిలో ఉంటాడని అన్నాడు.
ఇలావుంటే, విండీస్ టూర్‌కు వెళ్లేందుకు నిరాకరించిన కుంబ్లే కోచ్ పదవికి రాజీనామా చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా మారినట్టు ఒక బిసిసిఐ అధికారి వ్యాఖ్యానించాడు. కుంబ్లే పోటీలో లేకపోవడంతో, చాలా మంది ఆసక్తి ప్రదర్శించే అవకాశం ఉందని, అందుకే, మరికొన్ని దరఖాస్తులను తీసుకుంటామని బుధవారం పిటిఐతో మాట్లాడుతూ చెప్పాడు. వీరేందర్ సెవాగ్ రేసులో ముందున్నాడని వస్తున్న వార్తలపై స్పందించడానికి అతను నిరాకరించాడు. సెవాగ్ దరఖాస్తుకూ, మరి కొంత మంది నుంచి కూడా దరఖాస్తులు తీసుకోవడానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. మే 31వ తేదీతో దరఖాస్తు తేదీ ముగిసిన విషయాన్ని ప్రస్తావించగా, మరో వారం, పది రోజుల్లో దరఖాస్తుల ప్రక్రియ ముగుస్తుందన్నాడు.