ఆంధ్రప్రదేశ్‌

మనది సిరుల సీమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జూన్ 21: రాయలసీమలో అపారమైన వనరులు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే శరవేగంగా అభివృద్ధి సాధించగలుగుతామని సిఎం చంద్రబాబు అన్నారు. బుధవారం కర్నూలు జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. జూపాడుబంగ్లా మండలం తంగెడెంచ గ్రామంలో జైన్ ఇరిగేషన్ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణం పనులు, ఓర్వకల్లులో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణం, నంద్యాలలో 13 వేల పక్కా ఇళ్ల నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. చంద్రబాబు మాట్లాడుతూ రాయలసీమను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తాను కృషి చేస్తున్నానన్నారు. సారవంతమైన కర్నూలు జిల్లాలో అన్ని పంటలు పండించవచ్చని, ఈ భూముల్లో విత్తనోత్పత్తి చేసి ప్రపంచంలోని అన్ని దేశాలకు ఇక్కడి నుంచే విత్తనాలను పంపే స్థాయికి చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రాయలసీమలోని అన్ని జిల్లాలకే కాకుండా నెల్లూరు, ప్రకాశం జిల్లాలకూ సాగునీరు అందిస్తున్నామన్నారు. లాభదాయకమైన సూక్ష్మసేద్యం (డ్రిప్ ఇరిగేషన్) విధానంపై దృష్టి సారించామని, రాష్ట్రంలో డ్రిప్ ఇరిగేషన్ పథకం కింద అన్ని వర్గాల రైతులకు 90 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. రాయలసీమలో సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. గోదావరి నదిపై నిర్మించిన పట్టిసీమ కారణంగా కృష్ణా జలాలను అధికంగా రాయలసీమకు వినియోగిస్తున్నామన్నారు. నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఇంకా ఎక్కువ మొత్తంలో సాగునీరు సీమకు అందిస్తామని వెల్లడించారు.
అమరావతి పేర సొంత ఎయిర్‌లైన్స్
అమరావతి పేర సొంత ఎయిర్‌లైన్స్ నిర్వహించాలని నిర్ణయించినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. దేశంలో 18 శాతం ఎయిర్ ట్రాఫిక్ ఉండగా రాష్ట్రంలో 35 శాతం ఉందన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో విమానాశ్రయం నిర్మాణ పనులు ఏడాదిలోగా పూర్తి చేసి విమానాల రాకపోకలను ప్రారంభిస్తామన్నారు. విశాఖపట్టణం సమీపంలోని భోగాపురంలో అతి పెద్ద విమానాశ్రయం నిర్మాణానికి రంగం సిద్ధమైందని తెలిపారు.
అభివృద్ధికి అడ్డుతలుగుతున్న జగన్
రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేయడానికి తాను కష్టపడుతుంటే ఏదో విధంగా అడ్డుకోవడమే జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారని మండిపడ్డారు. తంగెడంచ సభలో వైకాపా ఎమ్మెల్యే ఐజయ్య జైన్ ఇరిగేషన్ సంస్థకు భూములు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని సిఎం తప్పుబట్టారు. అవగాహన లేకుండా మాట్లాడి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని వారించారు. జగన్ పదవి కోసం పడుతున్న పాట్లు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని, ఆ విధానాన్ని విడనాడాలని సూచించారు. ప్రభుత్వం సాగు తరువాత పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. ఈ విషయం తెలుసుకోకుండా పరిశ్రమలను వ్యతిరేకించడం మంచిది కాదని హితవు పలికారు. పరిశ్రమల ఏర్పాటులో తగిన సూచనలు ఇస్తే పరిశీలించి ఆమోదయోగ్యమైతే తాము అనుసరిస్తామన్నారు. పనిగట్టుకొని విమర్శలు చేస్తే పట్టించుకోబోమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమాల్లో ఉప ముఖ్యమంత్రి కెయి కృష్ణమూర్తి, మంత్రులు అమర్‌నాథ్‌రెడ్డి, కాలవ శ్రీనివాసులు, సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, అఖిలప్రియ, నంద్యాల ఎంపి ఎస్పీవై రెడ్డి, రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
చిత్రం: ఎన్టీఆర్ అమృతహస్తం, బాలామృతం కార్యక్రమంలో గర్భిణులకు అన్నం వడ్డిస్తున్న సిఎం చంద్రబాబు