జాతీయ వార్తలు

రేపే పిఎస్‌ఎల్‌వి-సి38 ప్రయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, జూన్ 21: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ జిఎస్‌ఎల్‌వి మార్క్3 వంటి భారీ రాకెట్ ప్రయోగం విజయవంతంగా చేపట్టి 20రోజుల గడవక ముందే మరో రికార్టు ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఏకంగా 31 ఉపగ్రహాలు ఒకేసారి రోదసీలోకి పంపేందుకు సర్వం సిద్ధం చేసింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ థావన్ స్పేస్ సెంటర్ నుండి శుక్రవారం ఉదయం 9:29కి పిఎస్‌ఎల్‌వి-సి 38 రాకెట్ నింగిలోకి ఎగరనుంది. దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్ గురువారం తెల్లవారు జామున 5.29కి ప్రారంభించనున్నారు. ప్రయోగానికి సంబంధించిన మిషన్ రెడీనెష్ రివ్యూ సమావేశం బుధవారం జరిగింది. అనంతరం షార్ డైరెక్టర్ పి.కున్హికృష్ణన్ అధ్యక్షతన లాంచింగ్ ఆథరైజేషన్ బోర్డు సమావేశమై సుదీర్ఘంగా చర్చించినంతరం ప్రయోగానికి సంసిద్ధత తెలిపారు. ప్రయోగ సన్నాహాల్లో భాగంగా బుధవారం రాకెట్ రిహార్సల్ విజయవంతంగా నిర్వహించారు. అంతకు ముందు ప్రీ కౌంటౌడౌన్ నిర్వహించారు. ఈ రాకెట్‌ద్వారా మన దేశానికి కార్టోశాట్-2ఇ ఉపగ్రహం, తమిళనాడులోని ఇస్తాం విశ్వ విద్యాలయం విద్యార్థులు రూపొందించిన మరో చిన్న ఉపగ్రహంతో పాటు 14దేశాలకు చెందిన 29నానో ఉపగ్రహాలతో కలిపి మొత్తం 31 ఉపగ్రహాలను ఒకేసారి రోదసీలోకి పంపనున్నారు. ఇస్రో చైర్మన్ ఎఎస్.కిరణ్‌కుమార్ గురువారం షార్‌కు చేరుకోనున్నారు. అన్ని సజావుగా జరిగి వాతావరణం అనుకూలిస్తే శుక్రవారం ఉదయం 9.29కి షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుండి రాకెట్ రోదసీలోకి దూసుకెళ్లనుంది.