హైదరాబాద్

యోగాతో శారీరక, మానసిక ప్రశాంతత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేరిలింగంపల్లి, జూన్ 21: భారత దేశ జీవన విధానమైన యోగ వల్ల శారీరక, మానసిక ప్రశాంతతో పాటు సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని చేవెళ్ళ ఎంపి కొండా విశే్వశ్వర్‌రెడ్డి అన్నారు. బుధవారం అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా భారత్ స్వాభిమాన్ ట్రస్ట్, పతంజలి యోగ్ సమితి, పతంజలి మహిళా యోగ్ సమితి సంయుక్త ఆధ్వర్యంలో చందానగర్ పిజెఆర్ స్టేడియంలో నిర్వహించిన యోగ ఉత్సవాల్లో భారీ సంఖ్యలో పాల్గొన్నారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, మాజీ ఎమ్మెల్యే ఎం.్భక్షపతియాదవ్, చందానగర్ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి, మాదాపూర్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్‌గౌడ్, పలువురు నేతలతో కలిసి ఎంపి విశే్వశ్వర్‌రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి యోగ వేడుకలను ప్రారంభించారు. వేడుకల్లో భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ తెలంగాణ చీఫ్ కోఆర్డినేటర్ శ్రీ్ధర్‌రావు, పతంజలి వెస్ట్ జోన్ ఇన్‌చార్జి శివకుమార్, గోరక్ష దళ్ నిర్వాహకులు ధీరజ్, బిజెపి రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కరరెడ్డి, అంజిరెడ్డి, గాలి గిరి, ఎంవి జ్ఞానేంద్ర ప్రసాద్, టిఆర్‌ఎస్ నాయకుడు జనపల్లి కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
షాబాద్: యోగతోనే మానవుడు అన్ని రంగాల్లో రాణించగలడని షాబాద్ ఎస్‌ఐ రవికుమార్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పాఠశాల ఆవరణంలో అంతర్జాతీయ యోగ దినం సందర్భంగా యోగ కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు రాము, శ్రీ్ధర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, మహేశ్, ప్రభాకర్, నరేష్ పాల్గొన్నారు.
వికారాబాద్: యోగ సాధన వల్ల మానసిక, శారీరక వికాసం కలుగుతుందని సిద్ధార్థ ఉన్నత, ప్రాథమిక పాఠశాల ప్రిన్సిపాల్స్ ఎం.శ్రీనివాస్, ఆర్.శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం పాఠశాలల్లో సంయుక్తంగా తృతీయ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. యోగాను ప్రపంచానికి పరిచయం చేసింది భారతదేశమని చెప్పారు. యోగాకు ఆదిగురువు పరమశివుడని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ సి.వేణుగోపాల్, సిఇవో గొడుగు సత్యనారాయణ, బి.లక్ష్మణ్, సంతోష్, కెటి శ్రీదేవి, విజయలక్ష్మి, షాహీన్, సల్మా, తబస్సుమ్, ప్రవీణ్ పాల్గొన్నారు.
ఎస్‌ఎపి కళాశాలలో..
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ అనంతపద్మనాభ కళాశాలలో బుధవారం ఉదయం అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం సంయుక్త కార్యదర్శి పి.గోవర్ధన్‌రెడ్డి, ప్రిన్సిపల్, ఎన్‌సిసి అధికారి డాక్టర్ ఎస్.మనోహర్‌రావు, ఫిజికల్ డైరక్టర్ జి.మహేశ్వర్‌రెడ్డి, ఎన్‌సిసి అధికారి డాక్టర్ జె.మందారిక, వాకర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు నారాయణగౌడ్, ఎల్లారెడ్డి, విజయ్‌కుమార్, కృష్ణారెడ్డి, ఎంపిటిసి మల్లేశం, వెంకట్‌రెడ్డి, శ్రీశైలం, ఆనంద్, తెలుగుశాఖాధిపతి డాక్టర్ డి.నారాయణరావు పాల్గొన్నారు.
కెపిహెచ్‌బి: నిత్యం యోగా చేయడంతో రోగాలు దరి చేరవని బాలాజీనగర్ డివిజన్ కార్పొరేటర్ కావ్య హరిష్‌రెడ్డి అన్నారు. బుధవారం ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ ఆరోగ్యం సంస్థ ఆధ్వర్యంలో అపోలో కాలేజ్‌లో ప్రసాద్ గురుజీ యోగా అభ్యసన చేశారు. కార్యక్రమంలో ముగిక్యాల రావు పాల్గొన్నారు.
అమూల్యమైన సంపాద యోగా
కాచిగూడ: పూర్వీకులు మనకు అందించిన అమూల్యమైన సంపాదన యోగా అని ప్రముఖ యోగా గురువు యాదుకృష్ణ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మతృశ్రీ హైస్కూల్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని బుధవారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాట్లాడుతూ.. నిత్యం యోగా చేయడంతో మానసిక ఒత్తిడి తగ్గుతుందని పేర్కొన్నారు. యోగాతో దేనినైనా జయించే శక్తి వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో యోగా గురువు రామ్‌మోహన్‌రావు, స్కూల్ కరస్పాండెంట్ అరవింద్ కపాట్కర్, ప్రిన్సిపాల్ రూప పాల్గొన్నారు.
కాచిగూడ: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మూడు రోజులుగా జివిఆర్ కరాటే అకాడమీలో నిర్వహిస్తున్న ఉచిత యోగా శిక్షణ తరగతులు బుధవారం ముగిసాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అంబర్‌పేట్ టిఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జిజ ఎడ్ల సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
యోగాతో ఒత్తిడిని దూరం చేయవచ్చన్నారు. కార్యక్రమంలో జివిఆర్ కరాటే అకాడమీ డైరెక్టర్ జిఎస్ గోపాల్‌రెడ్డి, టిఆర్‌ఎస్ నాయకురాలు విజితారెడ్డి పాల్గొన్నారు.
మేడ్చల్: అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని బుధవారం మేడ్చల్‌లో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో పతంజలి యోగ సమితి మేడ్చల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఉదయం 6 గంటల సమయంలో ప్రారంభించిన యోగ అసానాలు 8-30 గంటల వరకు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపిపి విజయలక్ష్మీ, జడ్పీటిసి శైలజ హరినాథ్, తహశీల్దార్ విష్ణువర్ధన్‌రెడ్డి, రాజేశ్వర్ గురుస్వామి, పతంజలి యోగ సమితి ప్రతినిధులు ఎం. కిషోర్, నాగభూషణం, వేణుగోపాల్ తదితరులతో పాటు బిజెపి నాయకులు విక్రంరెడ్డి, అమరం మోహన్‌రెడ్డి, జగన్‌గౌడ్ పాల్గొన్నారు.