రుచి

పనీర్ వంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనీరు పాలతో చేసిన పదార్థం. పాలలో ఎన్ని పోషక విలువలున్నాయో, పన్నీర్‌లో కూడా అంతకన్నా ఎక్కువ ఉంటాయి. పాలను విరిగిపోయేలా చేసి అందులో నీరు తీసివేసి దీన్ని అచ్చుగా ఫ్రిజ్‌లో పెడితే గట్టిగా కేక్ మాదిరి తయారవుతుంది. దీన్ని కావాల్సినంత ముక్క తీసుకొని వంటల్లోకి వేసుకోవచ్చు.

కాజు పనీర్ మసాలా
పనీర్ - 200 గ్రా., టమోటాలు - 4, గసగసాలు - 2 చెంచాలు, జీడిపప్పు పేస్ట్ - 1/4 కప్పు, వెల్లుల్లి, అల్లం పేస్ట్ - 2 చెంచాలు, పసుపు - 1/4 చెంచా
గరంమసాలా - 2 చెంచాలు, వెన్న - 5 చెంచాలు, కొత్తిమీర తరుగు - కొంచెం ఉప్పు - కొంచెం, ఉల్లి ముక్కలు - 1 కప్పు
విధానం: పనీర్ ముక్కలు వెన్నలో వేయించి నీళ్ళల్లో వేయాలి. బాణలిలో మిగతా వెన్న వేసి, గసగసాలు అల్లం వెల్లుల్లి,ఉల్లిముక్కలు వేసి వేయించాలి. ఇవి దోరగా వేయించాక జీడిపప్పు పేస్ట్ వేసి కలిపి, గరం మసాలా, పసుపు వేసి కలిపి ఒక కప్పు నీరు వేసి ఉడుకుతుండగా.. పనీర్ ముక్కలు వేసి కలపాలి. కొత్తిమీర, ఉప్పువేసి కలిపి ఐదు నిమిషాలు ఉడకనిచ్చి దింపాలి. అన్నం, చపాతీ దేనికైనా మంచి రుచి.

స్ప్రింగ్ రోల్స్
మైదా - 2 కప్పులు, మిర్చి - 4, టమోటాలు - 2, కాప్సికమ్ - 2, బంగాళాదుంపలు - 2, బఠాణీలు - 1, కప్పు, పనీర్ - 1 కప్పు, ఛీజ్ - 1 కప్పు, పుదీనా - కొంచెంస కొత్తిమీర - కొంచెం, అల్లం వెల్లుల్లి పేస్ట్ - 4 చెంచాలు
విధానం: కూర ముక్కలు తరిగి ఉడకబెట్టాలి. బాణలిలో నూనెను కొంచెంగా వేయాలి. కూర ముక్కలు ఉడికినవి వేసి మగ్గనివ్వాలి. కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి మగ్గనిచ్చి దీన్ని దింపి చల్లార్చి ఐదు ఉండలుగా చేసుకోవాలి. మైదాకి కొంచెం ఉప్పు నీరు చేర్చి పూరీ పిండి మాదిరి కలపాలి. దీన్ని 5 పెద్ద పూరీలుగా చేసుకొని అందులో ఈ కూర పెట్టి సమంగా సర్ది చుట్టలా చుట్టాలి. నూనె కాచి అందులో వేయించి తీసి రెండు ముక్కలుగా చేసుకోవాలి. ఇలా 5 పూరీలలో కూర పెట్టి రోల్స్‌గా చేసుకోవాలి.

వెజిటబుల్ మిక్స్
పన్నీర్ - 200 గా., కాప్సికమ్ - 2, ఉల్లిపాయ -1, అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 చెంచాలు, పెరుగు - 1/2 కప్పు, నిమ్మరసం - 2 చెంచాలు, మిరియాల పొడి - 1 చెంచా, గరం మసాలా - 1 చెంచా, ఉప్పు - 1 చెంచా, నూనె - 5 చెంచాలు, రాజ్‌మ - 1 కప్పు, మిర్చి - 2
విధానం: రాజ్‌మా కడిగి మిక్సీ పట్టి ముద్దగా చేసుకోవాలి. బాణలిలో నూనె వేసి ఉల్లి కాప్సికమ్ ముక్కలు వేయించి తీసి ప్రక్కన పెట్టాలి. పనీర్ ముక్కలు వేయించి ప్రక్కన పెట్టాలి. ఇప్పుడు బాణలిలో రుబ్బిన రాజ్‌మ వేసి బాగా కలపాలి. కొంచెం ఉప్పు, నీరు జల్లి మగ్గనివ్వాలి. ఇప్పుడు దీనికి మసాలా కారం, మిరియం పొడి, పెరుగు అన్నీ చేర్చి పన్నీర్ ముక్కలు కలిపి దింపాలి. ఇది గ్రేవీ మాదిరి ఉంటుంది. అన్నం, దోశె దేనికైనా బాగుంటుంది.

పన్నీర్ పసందు
పన్నీరు - 250 గ్రా., ఎండుద్రాక్ష - 12, జీడిపప్పులు - 12, పచ్చిమిర్చి - 2, కొత్తిమీర - కొంచెం, మైదా - 1/2 కప్పు, బియ్యంపిండి - 1/4 కప్పు
నూనె - 100 గ్రా.ష గ్రేవీ కోసం: ఉల్లిపాయలు - 2, టమోటా గుజ్జు - 1 కప్పు, ధనియాల పొడి, కస్తూరి వేధ - 5 చెంచాలు, వెనె్న - 5 చెంచాలు
కొత్తిమీర - కొంచెం, ఆవాలు - 1 చెంచా, జీలకఱ్ఱ - 1 చెంచా, ఎండుమిర్చి - 2
విధానం:పన్నీర్‌లో జీడిపప్పు ఎండుద్రాక్ష, పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ కలిపి ముద్దగా చేసుకుని బాదంకాయలుగా చేసుకుని ఉంచాలి. మైదా, బియ్యంపిండిలో తగినంత ఉప్పు వేసుకునిబజ్జీల పిండిలా కలుపుకోవాలి. పైన చేసిన బాదంకాయల్ని ఈ పిండిలో ముంచి కాగిన నూనెలో వేయించి తియ్యాలి. ఇలా మొత్తం చేసుకోవాలి.
ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, కొంచెం నూనె వేరే బాణలిలో వేసి, వేగనిచ్చి టమోటా గుజ్జు పోసి, ధనియాల పొడి, కస్తూరి వేసి కలపాలి. ఇవన్నీ ఉడికేలా రెండు కప్పుల నీరు చేర్చాలి. బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకఱ్ఱ, ఎండుమిర్చి ముక్కలు వేగనిచ్చి పై మిశ్రమంలో కలపాలి. ఇప్పుడు పైన వేయించిన కోల బాదంకాయలు కూడా ఈ గ్రావీలో వెయ్యాలి. ఇది రొట్టెలతో తినడానికి బాగుంటుంది.

పన్నీర్ బైట్స్
శెనగపిండి - 2 కప్పులు,బియ్యంపిండి - 1/2 కప్పు, పన్నీర్ - 2 కప్పులు, నూనె - 250 గ్రా., అల్లం వెల్లుల్లి పేస్ట్ - 5 చెంచాలు, వేరుశెనగపప్పు - 2 చెంచాలు, జీలకఱ్ఱ - 1 చెంచా, కరివేప - కొంచెం,
విధానం:పై పిండులలో పన్నీర్ కలిపి పకోడీల పిండిలా చేసుకుని నూనె కాగనిచ్చి పకోడీలుగా వదిలి వేయించుకోవాలి.

- ఎన్.వాణీప్రభాకరి