డైలీ సీరియల్

ట్విన్ టవర్స్ - 34

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాని, నేను అక్కడ నా ప్రొఫెసర్ వాళ్ళని ఎదుర్కోలేను. నాకు ఈ అవకాశం రావడానికి ఎంతమంది ప్రోత్సాహం, కృషి నా వెనక ఉందో నాకు తెలుసు. వాళ్ళందరినీ నిరుత్సాహపరిచాను. వాళ్లకు ఏ విధంగా మొహం చూపగలను?
ఇలాంటి పరిస్థితులు రీసెర్చ్ ప్రపంచంలో అరుదుగా జరుగుతాయని, మనం అన్నిటికి సిద్ధంగా ఉండాలని మా ప్రొఫెసర్స్ నచ్చచెప్పాలని ప్రయత్నించారు. కాని నేను అది ఒప్పుకోలేదు.
ఆ ఉత్తరం చదువుతుంటే నాకు కళ్ళంబడి నీళ్ళు ఆగలేదు. పెళ్లిచేసుకున్నందుకు అతనికి ఏ విధమయిన సపోర్టు ఇవ్వలేకుండా ఉన్నాను. పైగా అది అతని భవిష్యత్తును చెడగొడుతోందన్న భావన కలిగిస్తోంది. అతని దగ్గరనుంచి అంత నిరుత్సాహమయిన ఉత్తరం ఎప్పుడూ రాలేదు. ఏమిటో భయం వేసింది అది చదువుకుంటుంటే. బతకాలని లేదని రాస్తున్నాడు. ఏ చెడ్డ పనయినా చేయడు కదా! భయంతో వణికిపోయాను.
అందరి నుండి దూరంగా ఉన్నాడు. ఒక్కడూ ఉన్నాడు. ఎవరైనా ఒక కప్ కాఫీ ఇచ్చేవాళ్ళు కూడా ఉండి ఉండరు. ఈ వర్రీలతో ఆరోగ్యం చెడినా చూసేవాళ్ళు లేరు. తిన్నాడో లేదో అని చూసేవాళ్ళు కూడా లేరు.
ఇక నా మనసు అదుపు తప్పింది. ఎన్ని చెడ్డ ఆలోచనలు రావచ్చో అన్ని వచ్చాయి. రఘు ఏదో అనారోగ్యం పాలయినట్టు, ఒంటరిగా చాలా బాధపడుతున్నట్లు, ఇంకా ఇంకా ముందుకు వెళ్లిపోయాయి ఆలోచనలు. అమ్మో రఘు లేకుండా ఈ జీవితమా అన్నంత భయం వేసింది. ఆ రాత్రంతా నిద్రపట్టలేదు. శంకిస్తున్న మనసుతో అదుపు తప్పిన ఆలోచనలతో తెల్లవార్లు నిద్ర లేకుండా మెలకువగానే గడిపాను. పక్కనే ప్రశాంతంగా నిద్రపోతున్న వౌళిని చూస్తే వీడు ఎప్పుడైన వాళ్ళ నాన్నను అసలు చూస్తాడా అనిపించసాగింది.
భయం మనిషిని ఎంత కుంగదీయగలదో మొదటిసారిగా తెలిసింది. గబుక్కున లేచి, వౌళిని గుండెలకు హత్తుకున్నాను. నిద్ర మత్తులో కళ్లు తెరిచి, మళ్లీ నిద్రలోకి జారిపోయాడు. ఎంత చక్కని వయసు. ఏ చీకూ చింతా లేని వయసు. నాకు కూడా ఒక్కసారి చిన్నదాన్నై మా అమ్మ పక్కలో పడుకోవాలనిపించింది.
తెల్లవారి మా వదిన నాకు కాఫీ ఇస్తూ ముఖంలోకి చూచింది. ఆత్రుతగా అడిగింది ఏమయింది కళ్యాణి. రఘు ఉత్తరంలో ఏం రాశాడు, కాగితాలు పంపనన్నాడా?
మా వదిన అంత సూక్ష్మగ్రాహి అసలు ఎవరూ ఉండరు. నిన్న ఉత్తరం తనే తెచ్చి ఇచ్చింది. ఆ తరువాత పెద్దగా దాన్ని గురించి మాట్లాడలేదు. ఇవాళ నా మొహం చూడగానే ఆవిడ గ్రహించింది.
వౌనంగా వదినకి ఉత్తరం ఇచ్చాను. ఆవిడ చదువుతూంటే మొహంలో రంగులు మారాయి. వెంటనే తమాయించుకుని, ‘‘ఈ మాత్రానికే అంత దిగులు పడాలా కల్యాణి’’ ఏదో ఆ క్షణంలో అలా అనిపించి ఉంటుంది. ఊరికే కంగారు పడకు అని పైపైన నాకు ధైర్యం చెప్పాలని చూసింది కానీ, ఆవిడ కొంచెం కంగారు పడింది.
వెంటనే మా అన్నయ్య, నాన్న దగ్గరకు వెళ్లి ఒకసారి రఘుకు ఫోన్ చెయ్యమంది. రఘు నాన్నగారితో మాట్లాడమంది.
రఘుకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా దొరకలేదు. అతని నాన్నగారితో మాట్లాడటంకంటే వెళ్లడమనే నయమని, నాన్న వెంటనే హైదరాబాద్ బయలుదేరారు, ఆ ఉత్తరం తీసుకుని.
వాళ్ళు కూడా వర్రీగానే ఉన్నారు. ఒకసారి ఫోనులో పిలచి మాట్లాడారుట. మళ్లీ ఫోనులో దొరకడంలేదుట.
చివరకు నాన్న అన్నారుట. ‘‘కళ్యాణిని పంపుదాం. పాస్‌పోర్ట్ అవి రెడీగా ఉన్నాయి. టికెట్స్ అవి అన్ని ఏర్పాట్లు నే చేస్తాను. మీరు వీసాకు అవసరమైన పేపర్స్ తెప్పించంది అని చెప్పారు నాన్న. వాళ్ళందరికీ కూడా ఆ ఆలోచన బాగా నచ్చింది.
‘‘అయినా, మీరు ఆ ఉత్తరం చూచి ఏవో ఊహించుకోకండి. రఘు అంత బలహీనుడు కాదు. వాడు, మనసు, మెదడూ రెండూ ఒకేసారి ఉపయోగించడు. ఇది మనసు రాసిన ఉత్తరం. వాడి మెదడు చాలా మేధావంతమైయింది. అది వాడిని అదుపులో పెడుతుంది’’ అని నచ్చచెప్పారు. అయినా అక్కడనుండి ఫోన్ చేయాలన్నా రఘు ఫోన్‌లో దొరకలేదు. ‘‘మేం గట్టిగా నచ్చచెప్పడానికే ప్రయత్నిస్తాం’’ మీరు ధైర్యంగా ఉండండని చెప్పారు.
నాకు అమెరికా రఘు దగ్గరకు వెళ్లిపోవాలన్న కోరిక తొలిచేయడం మొదలుపెట్టింది. తను ఈ క్షణం విమానం ఎక్కడానికి సిద్ధం. కాని, అది అంత సులువు కాదు. రఘు నిలదొక్కుకుని తనకు పేపర్స్ పంపే వరకు తనేం చేయలేదు. నా నిస్సహాయత మీద మళ్లీ చాలా కోపం వచ్చింది. ఏం చెయ్యాలో తెలసి, అది చేసేందుకు చేతులు కట్టేస్తే- అనుభవించేది నరకయాతనే!
హైదరాబాద్ నుండి తిరిగి వచ్చిన నాన్న, వాళ్ళ దగ్గరనుంచి వచ్చే కబురుకోసం రేయి పగళ్లు ఎదురుచూశారు. రోజులు, వారాలు, నెలలు అవుతుంటే ఇంకా నాన్న- ఏదో ఒకటి చెయ్యాలి. రఘు క్షేమం తెలుసుకోవడానికి అనుకున్నారు.
విజయవాడలోనే ఓ పేరు ప్రతిష్ఠలున్న డాక్టర్‌గారు ఉన్నారు, ఆయన ఆ ఊరికి చైర్మన్‌గా కూడా పనిచేశారు. ఆయన కొడుకుల్లో ఒకతను చాలా కాలం క్రితం అమెరికా వెళ్ళాడు. అతను చాలా బ్రిలియంట్ అని ఫుల్ బ్రైట్ స్కాలర్‌షిప్ మీదే అమెరికా వెళ్లాడని, దాదాపు విజయవాడ నుండి మొట్టమొదటివాడు ఆ విధంగా అమెరికా వెళ్లాడు అని చెప్పుకునేవారు.
నాన్నకు ఆ డాక్టర్‌గారి కుటుంబంతో చాలా సన్నిహితం ఉండేది. ఆయన మా పెళ్లికి కూడా వచ్చారు. నాన్న ఆయన్ని చూడడానికి వెళ్ళారు.
జరిగిందంతకా చెప్పి ‘‘మీ అబ్బాయి, ఏమయినా రఘు బాగోగులు తెలుసుకోగలడేమో కనుక్కోమని’’ అడిగారు. ఆయన అమెరికా అంటే- మన విజయవాడటండీ! మన దేశానికి మూడు రెట్లు పెద్దది. అక్కడ ఎవరు ఎక్కడున్నారని, ఎవరు కనుక్కోగలరు’’ అన్నారుట.
‘‘అయినా ప్రయత్నించి చూద్దాం. మీ అబ్బాయి చాలా పెద్ద పొజిషన్‌లో ఉన్నారు కదా! పైగా ఆయన కూడా సైంటిస్ట్ కదా అన్నారు నాన్న.
డాక్టర్‌గారికి పెద్దగా నమ్మకం లేకపోయినా మా నాన్న దైన్యత చూచి కొడుక్కి వివరాలతో లెటర్ రాశారు. నాన్న స్వహస్తాలతో ఆ ఉత్తరంని పోస్ట్ చేసి ఇంటికొచ్చి అతని జవాబు కోసం ఎదురుచూస్తూ కూచున్నారు.
-ఇంకాఉంది