భక్తి కథలు

స్వామియే శరణం అయ్యప్పా! - 64

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శనిదేవుని మంత్రం
‘‘కోణస్థః పింగళో బ్రభ్రుః
కృష్ణో రౌద్రాంతకో యమః
శౌరిశ్చనైశ్వరో మందః
పిపలాదేవ సంస్తుతః
అని పఠించడంవల్ల శనిగ్రహ దోష పరిహారం జరుగుతుంది! అభీష్ట సిద్ధి లభిస్తుంది! రావిచెట్టు నీడలో కార్తీకమాసంలో బ్రాహ్మణులకు భోజనం పెడితే అనంతమైన పుణ్యం లభిస్తుంది! రావిచెట్టును నాటడం వల్ల నలభఐ రెండు తరాలవారికి స్వర్గం లభిస్తుంది!
పురాణాలలో చెప్పబడ్డ విషయాలను మాకుతెలిసినంతవరకు తెలియజెప్పాము! మీరందరూ అశ్వత్థ వృక్ష మహిమను గ్రహించి, పూజించి శుభాలు పొందాలన్నదే ఆ స్వామి సంకల్పం! వృక్షాన్ని పూజించి మీరందరూ ధన్యులవండి!’’ అంటూ పూజారులు చెప్పిన విఃయాలు విని భక్త్భిరి హృదయాలతో నమస్కరించారందరూ!
ఆయుధాలు తీసుకుని సైనికులు, పందల, పాండ్య రాజుల వెంట తిరిగి తమ స్వస్థానాలకు చేరుకున్నారు! అయ్యప్ప దయతో సుఖ, శాంతులతో జీవించసాగారు! పంబలరాజు తమ రాజ్యంలోని అయ్యప్పస్వమి ఆలయంలో తిరిగి పూజార్చనలు యధావిధిగా జరిగేట్లు చేశాడు! ఇతర ప్రాంతాలలో కూడా అయ్యప్ప ఆలయాలు వెలిశాయి! ప్రజలు భక్తి విశ్వాసాలతో స్వామిని కొలుచుకోసారు! వావర్ మొదలైనవారికి కూడా గుడులు ఏర్పాటు చేసి వాళ్లను చిరస్మరణీయులు కావించారు!
***
‘‘ఇదీ ప్రణవ్! అయ్యప్పస్వామి తిరిగి అవతరించి దుర్మార్గులను వధించి జనాలను రక్షించి ధర్మాన్ని స్థాపన చేసిన జానపదగాథ! ఒక విషయం గమనించావా? పురాణాలలో మహావిష్ణువు వేరు వేరు రూపాలతో, పేర్లతో అవతరిస్తుంటాడు! అయ్యప్ప చరితంలో మహిషి సంహారానికి హరిహరుల అంశతో జన్మించిన పుత్రునికి మహావిష్ణువు మణికంఠుడు అనీ, ధర్మశాస్తా అనీ పేర్లు ప్రసాదిస్తే, పరమేశ్వరుడు భూతనాథుడనే పేరుతో భూతగణాలకన్నిటికి నాయకుడిని చేశాడు! ఆ పుత్రుడు భూలోకంలో మణికంఠుడనే పేరుతో పెరిగి మహిషిని సంహరించాడు! మణికంఠుడు అవతార లక్ష్యం పూర్తయ్యాక శబరిగిరిమీద శిలారూపంలో ప్రతిష్ఠింపబడ్డాడు! అయ్యప్ప అనే పేరుతో ఆ ప్రాంత ప్రజలు మణికంఠుని వెళ్లవద్దంటూ ఆర్తిగా వేడుకున్నప్పుడు మణికంఠుడు తాను ఆ పేరుతోనే ప్రసిద్ధుడినౌతానంటూ వరం ప్రసాదించి సంతోషం కలిగించాడు! అందుకే అయ్యప్ప స్వామిగానే ప్రఖ్యాతి చెందాడు! ఈ పేరు ప్రజలు పెట్టినది! మహిషి సంహారం కృతయుగాంతంలో జరిగినట్లు గ్రహించాలి! తరువాతి యుగాలు గడిచి, కలియుగారంభంలో తిరిగి అరాచకం పంబల దేశ ప్రాంతంలో తలఎత్తినపుడు మణికంఠుడు అయ్యప్ప అనే పేరుతోనే అవతరించి వాళ్లను సంహరించాడు! తిరిగి తన విగ్రహంలోనే విలీనం చెందాడు! ఇదే ఈ స్వామిలోని ప్రత్యేకత! అవతార రూపం, మూల రూపం ఒకే విధంగా, ఒకే పేరుతో వుండటంవల్ల ఎక్కడ వెలసినా ఆ రూపంలోనే ఆ పేరుతోనే ఆరాధింపబడుతున్నాడు!’’ అంటూ చెప్పడం ఆపారు సుబ్బారావుగారు!
‘‘అర్థమైంది తాతయ్యా! దేవుడైన విష్ణుమూర్తి భూలోకంలో మానవుడిగా అవతరించినపుడు రాముడుగా కృష్ణుడుగా వేరే రూపాలతో, పేర్లతో జన్మించడం జరిగింది! కాని అయ్యప్పస్వామి మణికంఠుడు, ధర్మశాస్తా అనే దైవపరమైన పేర్లకన్నా ప్రజలు పెట్టిన పేరుతోనే పూజింపబడుతున్నాడు, అంతేగదా?’’ తనకు అర్థమైన విధంగా చెప్పాడు ప్రణవ్!
‘‘సరిగ్గా చెప్పావు! అయ్యప్పస్వామి గూర్చి, ఆయన అవతారగాథ గురించి చెప్పాను గదా! ఇంకా ఏం చెప్పమంటావు?’’ నవ్వుతూ అడిగాడు సుబ్బారావు గారు!
‘‘పంబలరాజ్యం, శబరిగిరి- వీటిలోనేగాక అయ్యప్పస్వామికి సంబంధింన పుణ్యక్షేత్రాలింకా ఏమైనా వున్నాయా?’’ అడిగాడు ప్రణవ్ కుతూహలంగా తాతగారివైపు చూస్తూ!
మనవడి ఆసక్తికి ముచ్చటపడుతూ చెప్పసాగారు తాతగారు!
‘‘ఉన్నాయి! పంబల రాజ్యం ఇప్పటి కేరళ రాష్ట్రంలోనిది! కేరళలోనే పురాణ ప్రసిద్ధమైన అయ్యప్పస్వామి ఆలయాలు ఎక్కువగా ఉన్నాయి. వాటిలో శబరిమలతోబాటు మరో నాలుగు చోట్ల వెలసి వున్న అయ్యప్పస్వామి క్షేత్రాలు మహిమాన్వితమైనవిగా చెప్పబడ్డాయి. ఈ నాలుగు స్థలాలలో మాత్రం వేరు వేరు రూపాలలో అయ్యప్పస్వామి వెలసి వుండటం ప్రత్యేకతగా చెప్పబడుతున్నది!
ఆ ప్రాంతాలు, అక్కడ వెలసి వున్న మూర్తులను శబరిమలమీద వెలసి వున్న మూలమూర్తిని కలిపి ‘పంచ అయ్యప్పలు’గా వ్యవహరిస్తారు ఆ ప్రాంతాలవాళ్లు! వాటి వివరాలు చెబుతాను అంటూ చెప్పడం కొనసాగించారు.
పంచ అయ్యప్పలు:
పంచతత్వ క్షేత్రాలు
1.కుళత్తుపుల- అనే క్షేత్రంలో అయ్యప్పస్వామి విగ్రహం బాలుని రూపంలో వుంటుంది! అందాలు చిందే పసిబాలుడుగా సాలగ్రామ శిలారూపంలో ‘కుళత్తూర్ అయ్యన్’ అనే పేరుతో పూజింపబడుతున్నాడు.
-ఇంకాఉంది

- డా.టి. కళ్యాణీసచ్చిదానందం