నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనకరి చిక్కె మైనసకు వాచవికిం జెడిపోయె మీను, తా
వినికికి చిక్కె జిక్కె జిల్వ కనువేదురు జెందెను లేళ్ళు, తావిలో
మనికి నశించె దేటి, తరమా యిరుమూటిని గెల్వ నైదు సా
ధనముల నీవె కావదగు దాశరధీ, కరుణాపయోనిధీ

భావము:అడవిలో స్వేచ్ఛగా తిరిగే ఏనుగు ఆడు ఏనుగును చూచి వ్యామోహమును పొంది బందీ అగును. చేప గాలములోని ఎర యొక్క రుచి మరిగి దానికి వశముగను. సర్పము పాములవాడు ఊదెడు స్వరమును విని పరశించి చిక్కిపోవును. హరిణము కనుపిచ్చి చేత నశించపోవును. తుమ్మెద పరిమళమునకు ఆకర్షితమై తామరపుష్పాల్లో చిక్కిపోవును. ఈ అయిదు ఇంద్రియాలను గెలుచుట ఎవరికి సాధ్యము. నేను ఇంద్రియలోలుడను కాబట్టి మోక్షమును పొందుట కష్టము. కాబట్టి పంచేద్రియముల నిన్ను గొల్చు పంచవిధ కైంకర్యముల చేత ఇంద్రియముల నడచి నన్ను కాపాడుమా!
దాశరథీ శతకములోని పద్యము