వరంగల్

లక్ష ఉద్యోగాలూ భర్తీ చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొర్రూరు, జూన్ 22: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 1లక్ష 07వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, గతంలో ముఖ్యమంత్రి కేసిఆర్ శాశనసభలో ప్రకటించిన విధంగా రానున్న రెండేళ్ల కాలంలో లక్ష ఉద్యోగాలను కచ్చితంగా భర్తీ చేస్తామని తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. తొర్రూరు డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రూ.70లక్షల వ్యయంతో నిర్మించిన 16 అదనపు తరగతిగదుల సముదాయాన్ని మంత్రి కడియం గురువారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ...రాష్ట్రంలో ఇప్పటికే టిఎస్‌పిఎస్సీ ద్వారా 26వేల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేశామని, అదేవిధంగా పోలీస్ శాఖలో 10వేల ఉద్యోగాలను భర్తీ చేశామని కడియం అన్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా 20వేల ఉపాధ్యాయ పోస్టులు, పోలీస్ శాఖలో 26వేల కానిస్టేబుళ్లు, ఇతర అధికారుల పోస్టులు, ఇతర ప్రభుత్వ శాఖల్లో మరో 82వేల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. గతంలో ఎన్నడు లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేస్తున్నామన్నారు. ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ విద్యాసంస్థలు పనిచేసేలా ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేసి ప్రభుత్వ పాఠశాలల పట్ల విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం కలిగించాలని కడియం శ్రీహరి సూచించారు. ఉపాధ్యాయులు క్రమశిక్షణ పాటిస్తూ విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలన్నారు.
ఉపాధ్యాయులు తరగతిగదుల్లో సెల్‌ఫోను వాడడం మానుకోవాలని, ఇకపై తరగతిగదుల్లో సెల్‌ఫొను వాడే ఉపాధ్యాయులను ఉపేక్షించమని, ఒకవేళ వాడినట్టు రుజువైతే ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తామని మంత్రి కడియం ఉపాధ్యాయులకు హెచ్చరికలు జారీ చేశారు. దేశంలో బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ లేనివిధంగా తెలంగాణ విద్య రంగ అభివృద్ధికి అత్యధిక నిధులు కేటాయిస్తున్నామన్నారు. తొర్రూరు పాఠశాలలో వంట గదులు, డైనింగ్ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యే దయాకర్‌రావు మాట్లాడుతూ..నియోజకవర్గంలో రైతుల సాగునీటి కష్టాలు తీర్చేందుకు ఇటీవల ఎస్సారెస్పీ సమీక్ష సమావేశంలో మైలారం రిజర్వాయర్ స్థాయిని పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఇందుకు కృషిచేసిన ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ సభ్యుడు పసునూరి దయాకర్, మహబూబాబాద్ కలెక్టర్ డాక్టర్ ప్రీతిమీనా, జిసిసి కార్పొరేషన్ చైర్మన్ దారావత్ గాంధీ నాయక్, మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌రావు, ఆర్డీఓ కృష్ణవేణి, ఎంపిపి కర్నె సోమయ్య, జడ్పీటిసి కమలాకర్, సర్పంచ్ రాజేష్‌నాయక్, విద్యాకమిటీ చైర్మన్ బిచ్యానాయక్, పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ సోమేశ్వర్‌రావు, మార్కెట్ చైర్మన్ నరేందర్‌రెడ్డి, హెచ్‌ఎం వేణుమాధవ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.