వరంగల్

మహిళా రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాదేవపూర్, జూన్ 22: పలిమెల మండలంలోని మోదేడుకు చెందిన మహిళ రైతు గురువారం ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంచలనం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పలిమెల ఎస్ ఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మోదేడుకు చెందిన చిడెం భాగ్య(35) బాపు దంపతులు అదే ఊరిలో రెండెకరాల మిర్చి పంట సాగు చేశారు. పంటకు పెట్టిన పెట్టుబడి రాలేదని, పంటకు వెచ్చించిన రెండు లక్షల రూపాయల అప్పును తీర్చలేక బెంగతో గురువారం తన ఇంట్లో పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన మోదేడు నుంచి మహాదేవపూర్ ఆసుపత్రికి ఎడ్ల బండిపై తీసుకువస్తుండగా , కొర్లకుంట నుంచి ఆసుపత్రి వరకు 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం తరలించారు. ఇదిలా ఉండగా మహదేవపూర్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతుండగానే భాగ్య మృతి చెందింది. భాగ్య కు భర్త బాపు, ఇద్దరు కుమార్తెలు శ్రీదేవి, శ్రీకన్య, కుమారుడు శ్రీకాంత్‌లు ఉన్నారు. మృతురాలు భాగ్య కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని సర్పంచ్ గుండ్లపల్లి భాగ్యరాజయ్య కోరారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నరేష్ తెలిపారు.