వరంగల్

పేదవర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనగామ టౌన్, జూన్ 22: పేదవర్గాల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి అన్నారు. జనగామ డివిజన్ దేవరుప్పుల మండల కేంద్రంలో గురువారం నూతన ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాన్ని ప్రారంభించి, డబుల్ బెడ్‌రూమ్‌ల ఇండ్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కడియం శ్రీహరి మాట్లాడుతూ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజల శ్రేయస్సు కోసం వినూత్న పథకాలను అమలు చేస్తూ వారి ఆర్థికాభివృద్ధి కోసం కృషిచేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ బంగారు తెలంగాణ కోసం నిరంతరం శ్రమిస్తున్నాడని, అందరు ఆయనకు తోడ్పాటునందించి దీవించాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేని ప్రతిపక్ష పార్టీల నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. వారి మాటలను నమ్మవద్దని ప్రజలను కోరారు. ఎమ్మెల్యే దయాకర్‌రావు మాట్లాడుతూ నియోజకవర్గం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ అండదండలు అందిస్తున్నారని ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. సాగు, తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామని అన్నారు. అనంతరం ఎంపి దయాకర్, గిరిజన కార్పొరేషన్ చైర్మన్ గాంధీనాయక్, కలెక్టర్ శ్రీదేవసేనలు మాట్లాడారు. ఎంపిపి సోమనర్సమ్మ, ఎంపిడివో ఉమామహేశ్వర్, నాయకులు కృష్ణమూర్తి, బస్వ మల్లేషం, అంజనేయులు పాల్గొన్నారు.

కార్పొరేట్ విద్యకు ప్రభుత్వం అనుకూలం
వరంగల్, జూన్ 22: తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలలో ఫీజుల నియంత్రణలో పూర్తిగా విఫలమయిందని, కార్పొరేట్ విద్యావ్యవస్థను కొమ్ముకాసే విధంగా వ్యవహరిస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బి.వెంకట్ ఆరోపించారు. గురువారం జిల్లా సిపిఎం కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే కారణంతో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను మూసివేయటాన్ని ఆయన తప్పుపట్టారు. కొత్తగా గురుకుల పాఠశాలలను ఏర్పాటుచేయటం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సంఖ్య కూడా తగ్గే ప్రమాదం ఉందని చెప్పారు. కేరళ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం ఉద్యమం మాదిరిగా కార్యక్రమాన్ని చేపడితే ఇక్కడ మాత్రం అటువంటి స్పందన లేకుండా పోయిందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు, ఇంగ్లీష్ మీడియాలను సమాంతరంగా అమలు చేస్తేనే కొంతమేరకు ఫలితాలు వస్తాయని చెప్పారు. గడచిన రెండేళ్లుగా డిఎస్సీ నియామకాలు జరగని కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఏర్పడిందని తెలిపారు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల మోతకు నిరసనగా ప్రజాసంఘాలు చేపట్టే అన్ని ఉద్యమాలకు తమ పార్టీ పూర్తిమద్దతు ఇస్తుందని వివరించారు. పండగల కోసం ప్రభుత్వం లేనిపోని ప్రాధాన్యత ఇవ్వటం లౌకికతత్వానికి విఘాతం కలిగిస్తుందని, పండగలకు ఇచ్చే ప్రాధాన్యాన్ని విద్యకు ఇస్తే బాగుంటుందని చెప్పారు. ముఖ్యమంత్రి కూతురు ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో కార్పొరేట్ విద్యాసంస్థను నిర్వహిస్తున్నారని, అధికారపార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కూడా ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థలను నిర్వహిస్తున్న కారణంగా ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోవటం లేదని ఆరోపించారు. కార్పొరేట్ విద్యాసంస్థలు వసూలు చేస్తున్న అధిక ఫీజులను నియంత్రించే విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకుంటే ఉద్యమిస్తామని చెప్పారు.
ముఖ్యమంత్రి గతంలో నాలుగు రోజులు విడిది చేసిన సందర్భంగా నిరుపేదలకు బహుళ అంతస్థుల గృహాలను నిర్మించి ఇస్తామని ప్రకటించినా ఇంతవరకు అమలు జరగలేదని వెంకట్ అన్నారు. ఇళ్ల నిర్మాణం పేరిట గుడిసెలు వేసుకున్న పేదలను బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని చెబుతూ ప్రత్యామ్నాయం చూపకుండా గుడిసెలు ఖాళీ చేయించటం సమంజసం కాదని అన్నారు. గుడిసెల స్థానంలో వారికి పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేసారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కార్పొరేట్ ఆసుపత్రులకు ప్రయోజనం కలిగించే విధంగా ఉన్నాయని తెలిపారు.
కొత్తగా ఏర్పాటుచేసిన జిల్లాకేంద్రాల్లో సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రులు, మండలాల్లో 30పడకల ఆసుపత్రులను ఏర్పాటుచేయాలని ఆయన సూచించారు. వరంగల్‌లో నిమ్స్ తరహా వైద్యశాలను ఏర్పాటుచేయాలని, ప్రభుత్వం తరపున మరో వైద్యకళాశాలను ఏర్పాటుచేయవలసిన అవసరం ఉందని చెప్పారు. విలేఖరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి, పార్టీ నాయకులు ప్రభాకర్‌రెడ్డి, జి.వెంకట్ తదితరులు పాల్గొన్నారు.