కృష్ణ

మీరాకుమార్ అభ్యర్థిత్వం హర్షణీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జూన్ 22: యుపిఏ భాగస్వామ్య పక్షాల రాష్టప్రతి అభ్యర్థిగా మాజీ స్పీకర్ మీరాకుమార్‌ను ప్రకటించడం హర్షణీయమని ఎపిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి పేర్కొన్నారు. దేశం గర్వించదగిన మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ కుమార్తెగానే కాకుండా ఆయన వారసురాలుగా రాజకీయాల్లోకి వచ్చి దశాబ్ధాల తరబడి ప్రజాసేవకు అంకితమైన మీరాకుమార్‌ను ఎంపిక చేయడం అభినందనీయమన్నారు. మీరాకుమార్ రాష్టప్రతి అభ్యర్థిగా ఎన్నిక కావడం దేశ చరిత్రాత్మక అవసరమని, రాష్టప్రతి ఎన్నికలో ఓటర్లుగా ఉన్న ప్రజాప్రతినిధులందరూ ఆత్మప్రభోదానుసారం ఓటు వేస్తే మీరాకుమార్ తప్పక విజయం సాధిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.
మీరాకుమార్‌కు మద్దతు తెలపాలి
సుదీర్ఘ రాజకీయ అనుభవమే కాకుండా ప్రజాసేవకురాలైన మీరాకుమార్‌ను యుపిఎ రాష్టప్రతి అభ్యర్థిగా ప్రకటించడం హర్షణీయమని మాజీ మంత్రి, ఎఐసిసి కార్యదర్శి సాకే శైలజానాథ్ పేర్కొన్నారు. తర తరాలుగా ప్రజాసేవకు అంకితమైన బాబూ జగ్జీవన్‌రామ్ కుమార్తెగానే కాకుండా అనుభవజ్ఞురాలైన మహిళా రాజకీయ వేత్తగా ప్రపంచ మహిళా రాజకీయ నేతలలో ఒకరుగా గుర్తింపు పొందిన మీరాకుమార్‌ను రాష్టప్రతి అభ్యర్థిగా ఎన్నిక కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న విషయాన్ని గుర్తించి ఎపిలోని అన్ని రాజకీయ పక్షాలు మీరాకుమార్‌ను బలపర్చాలన్నారు. మతతత్వ పార్టీలైన బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ వంటి పార్టీలు ప్రకటించిన అభ్యర్థిని కాకుండా సెక్యులర్ పార్టీల దళిత అభ్యర్థి అయిన మీరాకుమార్‌ను గెలిపించి ఆయా పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని శైలజానాథ్ కోరారు.