కృష్ణ

నిషేధిత జాబితానుంచి ఆలయ భూములను తొలగించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట, జూన్ 22: క్రయ విక్రయాల నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల గత కొన్ని దశాబ్దాలుగా ఆలయ భూములను గతంలో కొనుగోలు చేసి అనుభవిస్తున్న వారు భయాందోళనలకు గురవుతున్నారని, దీనిపై సమగ్ర విచారణ నిర్వహించి నిషేధిత భూముల జాబితానుండి ఆయా భూములను తొలగించాలంటూ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ గురువారం దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావును కలిసి వినతిపత్రం అందించారు. జగ్గయ్యపేట పట్టణం, నియోజకవర్గ పరిధిలో ప్రైవేటు వ్యక్తులకు చెందిన వ్యవసాయ, వ్యవసాయేతర భూములు సుమారు 2,996 ఎకరాల భూమిని నిషేధిత భూముల జాబితాలో చేర్చారని, వీటి రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయని, గతంలో ఆలయంలో పనిచేసేవారికి కేటాయించిన భూములు కొన్ని అన్యాక్రాంతమయ్యాయని, వారి కుటుంబ సభ్యులు గత్యంతరం లేని పరిస్థితులలో అమ్మివేయడంతో తెలియక కొన్నవారు ఇబ్బందులు పడుతున్నారని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. దీనిపై సమగ్ర విచారణ నిర్వహించాలని వారు కోరారు.