గుంటూరు

వైసిపి ప్లీనరీ...ప్రజా ఉద్యమాలకు నాంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 22: అవినీతి, అరాచక, ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై ప్రజా ఉద్యమ నాందికి రాష్టస్థ్రాయి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశం వేదిక కానుందని ఆ పార్టీ నేతలు అప్పిరెడ్డి, వెలంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్ తదితరులు పేర్కొన్నారు. గురువారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న ఖాళీస్థలంలో ప్లీనరీ ఏర్పాట్లకు సంబంధించి పార్టీ నేతలు భూమిపూజ చేశారు. అనంతరం విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు రాజకీయ పరిణామాలు చంద్రబాబు వాగ్దాన భంగాలపై చర్చించి, వేదిక ద్వారా ప్రభుత్వంపై పోరుబాట పట్టేందుకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటివరకు రాష్టవ్య్రాప్తంగా నియోజకవర్గాల వారీగా జరిగిన ప్లీనరీలను ఏ విధంగా విజయవంతం చేశారో వచ్చే నెల 8,9 తేదీల్లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి ప్లీనరీని సమష్ఠికృషితో విజయవంతం చేసేందుకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు మూడేళ్ల పాలన విహారయాత్రలా సాగిందే తప్ప ప్రజలకు ఉపయోగపడే రీతిలో సాగలేదని విమర్శించారు. రైతు, డ్వాక్రా రుణాల మాఫీని మాయమాటలతో మభ్యపెట్టి, విద్య, వైద్యరంగాలను తీవ్ర నిర్లక్ష్యానికి గురిచేశారని విరుచుకుపడ్డారు. ప్లీనరీ వేదిక సాక్షిగా జగన్ నేతృత్వంలో ప్రభుత్వ పతనానికి నాంది పలుకుతామని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కావటి మనోహర్ నాయుడు, ఆతుకూరి ఆంజనేయులు, అడపా శేషుబాబు, బ్రహ్మారెడ్డి, బొల్లా విజయకుమార్, గౌస్, పల్లపు మహేష్, బొర్రా వెంకటేశ్వరరెడ్డి, అశోక్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.