గుంటూరు

ఎమ్మెల్యే ఆర్‌కెకి బెయిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాచర్ల, జూన్ 22:మాచర్ల శాసనసభ్యుడు పినె్నల్లి రామకృష్ణారెడ్డికి గురువారం సాయంత్రం హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. వెల్దుర్తి మండలం కల్వగుంట గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త తాడిపర్తి పాపిరెడ్డి హత్యకేసులో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి 13వ ముద్దాయిగా ఉన్నారు. ఈ కేసులో పదిమంది ముద్దాయిలను మే 30వ తేదీన మాచర్ల రూరల్ సిఐ శివశంకర్ అరెస్ట్ చేశారు. ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్న పినె్నల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి, అనిమిరెడ్డిలు గత నెల 17వ నుంచి ఇప్పటివరకు అజ్ఞాతంలో ఉన్నారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి గురువారం బెయిల్ మంజూరు కావడంతో వైసిపి కార్యకర్తలు, నాయకులు పట్నంలో బాణాసంచా పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. శనివారం ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాచర్లకు రానున్నట్లు వైసిపి నాయకులు తెలిపారు.