శ్రీకాకుళం

సినిమా సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), జూన్ 22: సినిమా అనేది సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని డి ఎస్పీ కె.్భర్గవరావునాయుడు అన్నారు. స్థానిక ఓ హోటల్‌లో గురువారం ‘గల్ఫ్’ సినిమాపై ఉత్తరాంధ్రాలో అవగాహన యాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రలోభాలకు లోబడి గల్ఫ్ దేశాలకు చాలామంది వెళ్లి నష్టపోతున్నారని దానిని ఈ చిత్రం ద్వారా ప్రజలకు తెలియజేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. దర్శకుడు సునీల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ సమస్యలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తరువాత గల్ఫ్ సినిమా తీయబడిందని రెండేళ్లుగా పనిచేసి దుబాయ్, కువైట్‌లో కూడా షూటింగ్ చేశామన్నారు. పోలీసు శాఖ సహకారం కూడా అందించినట్లు తెలిపారు. దీనిని లవ్,వినోదాన్ని మేళవించి సినిమా తీశారన్నారు. దీనిని ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌కు పంపడం జరుగుతుందన్నారు. కో డైరెక్టర్ రాజా మాట్లాడుతూ గల్ఫ్ సినిమా తీయడం పూర్తయిందని విడుదలకు సిద్ధంగా ఉందన్నారు. గ్రామాల్లో కూడా అవగాహన కల్పించనున్నట్లు స్పష్టంచేశారు. 28లక్షల మంది భారతనుండి గల్ఫ్ దేశాలకు వెళ్లి ఎంతో మంది జైలుకు వెళ్తున్నారన్నారు. ప్రభుత్వం కూడా స్పందించాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రం తీయబడిందని తెలియజేశారు. ఈ సమావేశంలో సందీప్, గీతాశ్రీకాంత్ తదితరులు ఉన్నారు.