శ్రీకాకుళం

తిరుపతికి భజన బృందాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎచ్చెర్ల, జూన్ 22 : కలియుగ వైకుంఠంగా ఫరిడిల్లుతున్న శ్రీవేంకటేశ్వర స్వామి సన్నిధైన తిరుమల తిరుపతిలో ప్రదర్శన ఇచ్చే అవకాశం జరజాం గ్రామానికి చెందిన ఆనందరామ, అయోధ్యరామ భజనబృందాలకు దక్కింది. ఈ బృందాలు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ప్రదర్శనలు ఇవ్వడంతోపాటు శ్రీకాకుళం నగరంలో సంక్రాంతి సంబరాలు వేదికగా అధికారులు, ప్రజాప్రతినిధులు మెప్పును పొందగలిగారు. వినాయక, దేవి నవరాత్రులు, గ్రామదేవత ఉత్సవాలు, శ్రీరామనవమి వేడుకలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భక్తిని పెంచే గీతాలను ఆలపిస్తు, జానపదులు మాదిరీగా సాంస్కృతిక ప్రదర్శన ఇస్తూ ప్రేక్షకుల మన్నలను పొందుతున్నారని చెప్పడంలో అతిశయోక్తి కాదు. మహిళలు, పురుషులు భజనబృందం ద్వారా ఆటపాటలతో అహుతులను అలరిస్తూ అనేక ప్రదర్శనలు ఇస్తున్నారు. ఈ భజనబృందాలకు తిరుపతిలో ప్రదర్శించేందుకు టిటిడి అధికారులు ఆహ్వానాలు పలికారు. టిటిడి ఆహ్వానం మేరకు ఆనందరామ, అయోధ్యరామ భజనబృందాలు తిరుపతికి గురువారం పయణమయ్యాయి. ఈమండళ్లకు ఆర్గనైజర్లుగా తంగి మల్లేశ్వరరావు, బట్న గోపాల్, రామలక్ష్మీ, శాస్ర్తీ తదితరులు వ్యవహరించనున్నారు.