విశాఖపట్నం

బ్యాంకులకు వెళ్లాలంటే ప్రజలు భయపడిపోతున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 22: రుణాల కోసం బ్యాంకులకు వెళ్లాంటేనే ప్రజలు భయపడిపోయే పరిస్థితులు నెలకొన్నాయని, దళారుల ప్రమేయంతో నచ్చిన వారికే రుణాలు మంజూరవుతున్నాయంటూ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ అధ్యక్షతన గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఎమ్మెల్యేలు బ్యాంకు అధికారులు అనుసరిస్తున్న వైఖరిపై మండిపడ్డారు. పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత మాట్లాడుతూ బ్యాంకుల్లో దళారుల ప్రమేయం పెరిగిపోతోందని ఆరోపించారు. తన నియోజవర్గ పరిధి నక్కపల్లి, పాయకరావుపేట మండలాల్లో బ్యాంకుల్లో అధికారులు లబ్ధిదారులు అందరినీ దొంగల్లా చూస్తున్నారని ఆరోపించారు. గతంలో ఎవరో రుణాలు ఎగవేశారని, ప్రస్తుతం రుణాల కోసం వెళ్లిన వారందరి పట్ల హీనంగా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. ఎస్సీ,ఎస్టీ, బిసి రుణాలకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని తీసుకునే విధంగా దళారులు రంగప్రవేశం చేసి బ్యాంకు అధికారులతో మాట్లాడి రుణాలు ఇప్పిస్తున్నారన్నారు. బ్యాంకు అధికారులు ఈ విధానాన్ని విడిచిపెట్టాలని సూచించారు. అలాగే మండల అధికారులు మంజూరైన రుణాలు, వాటి పరిస్థితులపై అవగాహన కలిగి ఉండాలని, క్షేత్ర స్థాయిలో యూనిట్‌లు గ్రౌండ్ కాని వాటిని గుర్తించి, బ్యాంకర్లతో మాట్లాడి పరిష్కరించాలని సూచించారు. ఎమ్మెల్యే ఆరోపణలపై స్పందించిన కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
ఇక విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యుడు ఏకంగా బ్యాంకు అధికారుల తీరును ఎండగట్టారు. ఉత్తర నియోజకవర్గం నుంచి 376 దరఖాస్తులను ముద్ర రుణాల కోసం తాను స్వయంగా పంపానని, ఒక్క దరఖాస్తు కూడా గ్రౌండ్ కాలేదన్నారు. చిరు వ్యాపారులకు ఎటువంటి హామీ లేకుండా రుణాలు మంజూరు చేయాలని ప్రధాని మోదీ సంకల్పించారని, అందుకే ముద్ర పేరిట రుణాలు ఇవ్వాలని బ్యాంకులను ఆదేశించారన్నారు. అయితే ప్రధాని ఆశించిన మేర బ్యాంకులు బాధ్యత వహించట్లేదన్నారు. తాను పంపిన దరఖాస్తులన్నీ అర్హులైన నిరుపేదలవేనని, వారికి అవసరమైతే తానే గ్యారంటీ ఇస్తానన్నారు. దీనిపై కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ స్వయంగా పరిశీలించాలన్నారు. నియోజవర్గంలో అర్హులైన ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నానన్న ఆవేదనతోనే బ్యాంకర్ల సమావేశంలో ఈ విధంగా మాట్లాడానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కలెక్టర్ ముద్ర దరఖాస్తులను పరిశీలించి అన్నిటినీ మంజూరు చేయాలని లీడ్ బ్యాంకు మేనేజర్‌నును ఆదేశించారు. అంతకు ముందు కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ బ్యాంకర్లు, ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి రుణ లక్ష్యాలను సాధించాలన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు నిర్ధేశిత రుణ లక్ష్యాలను సాధించేందుకు శాఖల వారీగా టార్గెట్లు నిర్ణయించాలన్నారు. అలాగే జిల్లాలో తీసుకున్న నిర్ణయాలపై మండల స్థాయిలో అవగాహన కలిగించాలని సూచించారు. ప్రభుత్వ శాఖలకు బ్యాంకర్లతో సమస్యలుంటే లీడ్ జిల్లా మేనేజర్ దృష్టికి తీసుకురావాలన్నారు. సెప్టెంబర్ 30 లోగా అన్ని శాఖలు రుణాలు మంజూరు చేసేందుకు లబ్ధిదారులను ఎంపిక చేసుకోవాలన్నారు. పశుసంవర్ధక శాఖ ద్వారా పాడిపశువుల కోసం 25 శాతం సబ్సిడీని, ఎస్సీ,ఎస్టీలకు 33 శాతం సబ్సిడీ అందించనున్నామని, దీనిపై విస్తృత ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే బల్క్‌మిక్క్ కూలింగ్ యూనిట్ల స్థాపనకు రూ.20 లక్షల రుణంలో 25 శాతం సబ్సిడీని అందించే అంశాన్ని స్వయం సహాయక సంఘాలకు వివరించాలన్నారు. రుణ అర్హత లేని కౌలు రైతులకు కల్టివేషన్ సర్ట్ఫికెట్లు ఇచ్చి రుణాలు అందేలా చూడాలన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన పథకాలకు రుణాలు ఇవ్వని బ్యాంకుల జాబితాలు అందించాలని, వారిపై చర్యలకు సిఫారసు చేస్తామని వెల్లడించారు. సమవేశంలో లీడ్ జిల్లా మేనేజర్ శరత్‌బాబు, సహాయ కలెక్టర్ మిషా సింగ్, జెసి 2 డివి రెడ్డి, రిజర్వ్ బ్యాంకు ప్రతినిధి లక్ష్మణ్, పలు బ్యాంకుల మేనేజర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.