విశాఖపట్నం

ఇంకుడు గుంతలు తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 22: భూగర్భ జలాల పెరుగుదల నిమిత్తం బహుళ అంతస్తుల భవనాల్లో తప్పనిసరిగా రెయిన్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ (ఇంకుడు గుంతలు) ఏర్పాటు చేయాలని జివిఎంసి కమిషనర్ హరినారాయణన్ స్పష్టం చేశారు. జివిఎంసి ప్రధాన కార్యాలయంలో జోన్ 1,3 ప్రాంతాలకు చెందిన రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల ప్రతినిధులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షపు నీటిని పరిరక్షించుకోవడం ద్వారా భవిష్యత్ నీటి ఇబ్బందును నిలువరించవచ్చన్నారు. అలాగే పారిశుద్ధ్య నిర్వహణలో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు భాగస్వామ్యం కావాలన్నారు. ముఖ్యంగా తడి-పొడి చెత్త సేకరణలో వీరి సహకారం అవసరమన్నారు. ఇప్పటి వరకూ అసోసియేషన్‌లు, ప్రజలు భాగస్వామ్యం వల్లే స్వచ్ఛ సర్వేక్షన్‌లో జివిఎంసి 3వ ర్యాంకు సాధించగలిగిందన్నారు. కాలనీల్లో పార్కుల అభివృద్ధికి సంబంధించి అసోసియేషన్లు ప్రతిపాదిత అంచనాల్లో మూడవ వంతు చెల్లించేందుకు ముందుకు వస్తే పనులు మంజూరు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు ఉయద్ షిర్మాణి మాట్లాడుతూ పిఎం పాలెం, మధురవాడ, మిధిలాపురి కాలనీ, జాతర తదితర ప్రాంతాల్లో సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకురాగా పరిష్కారానికి హామీ ఇచ్చారు. సమావేశంలో జోనల్ కమిషనర్లు వి సత్యవేణి, చక్రధర్, ఇతర అధికారులు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.