విశాఖ

మొండుపాలెం కిడ్నీ బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, జూన్ 22: మండలంలోని సుందరయ్యపేట శివారు మొండుపాలెం గ్రామస్తులు ప్రాణాంతకమైన కిడ్నీవ్యాధిబారిన పడి మృత్యువాతకు గురవుతున్నారు. 2013నుండి ఇప్పటివరకు 13మంది కిడ్నీవ్యాధి సోకి మృత్యువాతకు గురికాగా మరో ముగ్గురికి ఈ వ్యాధి సోకినట్లు నిర్ధారణ జరిగింది. కేవలం 450 జనాభా కలిగిన ఈ గ్రామంలో వ్యాధి తీవ్రత, ఇందుకు దారితీసిన పరిస్థితులను తెలుసుకునేందుకు మాజీమంత్రి కొణతాల రామకృష్ణ గురువారం ఆ గ్రామాన్ని సందర్శించారు. ఇంటింటికి వెళ్లి ఆ గ్రామంలో సమస్య తీవ్రతను తెలుసుకున్నారు. కిడ్నీవ్యాధి వలన మృత్యువాతకు గురైన వారి కుటుంబీకులను పరామర్శించారు. గ్రామం చుట్టూ స్టోన్‌క్రషర్‌లుండటం వలన ధూళి కమ్మి ఈ వ్యాధి ప్రబలుతుందని గ్రామస్తులు కొణతాల వద్ద తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు. నీటి కాలుష్యంతోపాటు వాయు కాలుష్యం వలన కూడా ఈ వ్యాధి సోకి ఉండవచ్చని కొణతాల అభిప్రాయపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే ఈ గ్రామానికి విచ్చేసి అచ్చియ్యపేట గ్రామానికి ఈ ప్రాంతం మొత్తం తరలిస్తానని హామీ ఇచ్చారని గ్రామస్తులు తెలిపారు. అచ్చియ్యపేట నుండి ప్రస్తుతం పైపులైన్ ద్వారా ఈ గ్రామానికి నీటి సరఫరా జరుగుతోంది. కిడ్నీవ్యాధి వలన మృత్యువాతకు గురైన వారి కుటుంబీకులకు నష్టపరిహారం జరగలేదని మృతుల కుటుంబీకులు కొణతాల వద్ద తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు. డ్వాక్రా సంఘాల ద్వారా ఐదువేల మొత్తం అందిందని, మరో 20వేలు అందుతుందని అధికారులు చెబుతున్నారన్నారు. ఈ సమస్య తీవ్రతపై మాజీమంత్రి కొణతాల జిల్లా కలెక్టర్‌తోను ఫోన్ ద్వారా సమస్య తీవ్రతను తెలియజేసారు. దీనిపై స్పందించిన సంబంధిత అధికారులు తక్షణమే గ్రామంలో వైద్యారోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తామని తనకు స్పష్టం చేసినట్లు కొణతాల పేర్కొన్నారు. కిడ్నీ వ్యాధి సోకి మృత్యువాతకు గురైన వారి కుటుంబీకులకు మూడులక్షల నష్టపరిహారం చెల్లించాలని, వ్యాధి భవిష్యత్‌లో ప్రబలకుండా తగు చర్యలు తీసుకోవాలని, గ్రామంలో ఉచిత కిడ్నీ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి ఈ వ్యాధి సోకుతుందనే భయంతో ఉన్న గ్రామస్తులకు నైతిక స్థైర్యాన్ని కల్పించే చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ను కోరినట్లు కొణతాల తెలిపారు. ఈ పర్యటనలో ఆయన వెంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మలసాల కిషోర్, సిడిసి మాజీ చైర్మన్ శానాపతి గంగునాయుడు, తుమ్మపాల ఎంపీటిసి చదరం నాగేశ్వరరావు, మాజీ ఎంపీటిసి కె. ఏడుకొండలు, నూకాంబిక దేవస్థానం మాజీ చైర్మన్ పీలా నాగశ్రీను, ఎంఎన్‌సి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.