విజయనగరం

మీజిల్స్, రుబెల్లా వ్యాధుల నుంచి రక్షణ కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూన్ 22: ప్రమాదకరమైన మీజిల్స్, రుబెల్లా వ్యాధుల నుంచి పిల్లలకు రక్షణ కల్పించాలని జెసి కె.నాగేశ్వరరావు అన్నారు. గురువారం తన చాంబర్‌లో వైద్యాశాఖ, విద్యాశాఖ, పంచాయతీ, మున్సిపాలిటీ సంక్షేమశాఖల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2020 నాటికి దక్షిణాసియా దేశాల్లో మీజెల్స్ రుబెల్లా వ్యాధులను పూర్తి స్థాయిలో నియంత్రించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యింగా నిర్ధేశించిందన్నారు. ఇదిలా ఉండగా ప్రపంచ వ్యాప్తంగా ప్రతీఏటా 1.14 లక్షల మంది పిల్లలు మరణిస్తున్నారని అందులో మూడింట ఒక వంతు మంది మన దేశంలోనే మరణాలు సంభవిస్తున్నాయన్నారు. 9 నెలల నుంచి 15 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు తప్పనిసరిగా మిజిల్స్, రుబెల్లా వ్యాక్సిన్లను పంపిణీ చేయాలన్నారు. ప్రస్తుతం దేశంలో మొదటి దశలో ఐదు రాష్ట్రాల్లో ఈ వ్యాక్సిన్ క్యాంపైన్ అమలు చేస్తున్నారన్నారు. రెండవ దశలో ఆంధ్రప్రదేశ్‌తోపహా 8 రాష్ట్రాల్లో ఈ క్యాంపైన్ నిర్వహించనున్నారని వివరించారు. అందులో భాగంగా ఆగస్టు నెలాఖరు వరకు దీనిపై విస్తృతంగా ప్రచారం చేసి 5.67 లక్షల మంది పిల్లలకు 9 నెలల నుంచి 15 ఏళ్లలోపు వయస్సు గల పిల్లలకు వ్యాక్సిన్ వేయాలన్నారు. ఈ ఏడాది ఆగస్టులో మొదటి రెండు వారాలు అన్ని పాఠశాలల్లో వ్యాక్సిన్లు వేస్తామని, తదుపరి రెండు వారాలు అంగన్‌వాడీ కేంద్రాలపై దృష్టిసారించి ఆయా కేంద్రాల్లోని పిల్లలకు వ్యాక్సిన్ వేస్తారని వివరించారు. సెప్టెంబర్ మొదటి వారంలో ఇంకా మిగిలిపోయిన పిల్లలకు ఇంటింటికీ వెళ్లి సర్వే ద్వారా గుర్తించి శతశాతం మందికి వ్యాక్సిన్ వేయిస్తామన్నరు. ఈ సమావఏశంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి, ఎంఆర్ క్యాంపైన్ నోడల్ అధికారి డాక్టర్ శరత్ మాట్లాడుతూ మీజెల్స్, రుబెల్లా లక్షణాలను, వాటి వ్యాప్తిని, వాటి వల్ల కలిగే ప్రమాదాలను వివరించారు. ఈ సమావేశంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ కృష్ణ కిశోర్, డిప్యూటీ డిఎంహెచ్‌ఒ డాక్టర్ చామంతి, అడిషనల్ డిఎంఎహెచ్‌ఒ, డిఇఒ అరుణకుమారి, ఐసిడిఎస్ పిడి రాబర్ట్స్, డిఆర్‌డిఎ, పంచాయతీ, మున్సిపల్ శాఖల అధికారులు, చిన్న పిల్లల ఆసుపత్రుల వైద్యులు పాల్గొన్నారు.