అనంతపురం

లారీలో కుక్కి పశువుల తరలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడిపత్రి, జూన్ 22: మానవత్వం మంటకలిసేలా లారీలో పశువులను కుక్కి, బయటికి ఏ మాత్రం కనబడకుండా లారీకి తార్‌పాల్ పట్టతో బిగించి, పశువులను కబేళాకు తరలిస్తున్న లారీని విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు అడ్డుకున్నారు. స్థానిక మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ కరుణసాగర్‌రెడ్డి గురువారం వాహనాలను తనిఖీ చేస్తుండగా పెనుగొండ నుంచి కేరళలోని పొలాచి ప్రాంతానికి ఓవర్ లోడ్‌తో లారీలో తరలిస్తున్న పశువులను గమనించి ఎమ్‌విఐ కార్యాలయానికి తరలించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న విహెచ్‌పి రాయలసీమ విభాగ్ అధ్యక్షులు రాధాకృష్ణ ఆధ్వర్యంలో విహెచ్‌పి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఎంవిఐ కార్యాలయానికి తరలివచ్చారు. ఎంవిఐ అధికారులు ఫైన్ వేశామని లారీని తీసుకెళ్ళమని డ్రైవర్‌ను ఆదేశించగా, లారీని తరలించకుండా విహెచ్‌పి కార్యకర్తలు అడ్డుపడి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పట్టణ సిఐ భాస్కర్‌రెడ్డి, ఎస్సై ఆంజనేయులు వచ్చి పరిశీలించారు. లారీలో దాదాపు 30 పశువులను తరలిస్తుండడంతో ఒక దానిపై ఒకటి కిందపడిపోయి ఉండటాన్ని గమనించిన రాధాకృష్ణ కార్యకర్తలతో కొన్ని పశువులను లారీ నుంచి కిందికి దింపి తాగునీరు పట్టించారు. లారీలోని పశువులన్ని దింపాలని, లారీ ముందుభాగంలో ఆవులున్నాయని రాధాకృష్ణ ఆరోపించగా, పోలీసులు అంగీకరించ లేదు. దాదాపు 30 పశువులను ఒక దానిపై, ఒక దాన్ని కుక్కి గాలి తగలకుండా అక్రమంగా వందలాది కిలోమీటర్ల దూరానికి పశువులను తరలించడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు లక్ష్మినారాయణ, విహెచ్‌పి కార్యకర్తలు రామాంజినేయులు, నరసింహులు, రాజశేఖరరెడ్డి, దుర్గాప్రసాద్, కుళ్ళాయప్ప తదితరులు పాల్గొన్నారు.