కర్నూల్

నంద్యాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, జూన్ 22: నంద్యాల అసెంబ్లీకి ఉప ఎన్నిక రానున్నదని, అధికారులందరు ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు యుద్ధప్రాతిపదికన నివేదికలు సిద్ధం చేయాలని మున్సిపల్ మంత్రి నారాయణ ఆదేశించారు. గురువారం నంద్యాల ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో విలేఖర్లతో మంత్రి నారాయణ మాట్లాడుతూ సిఎం చంద్రబాబునాయుడు జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షలో నంద్యాలలో రోడ్ల విస్తరణ కోసం రూ. 60 కోట్లు మంజూరు చేశారన్నారు. సిఎం ఆదేశాల మేరకు నంద్యాల నియోజకవర్గంలో అభివృద్ధి పనులను దాదాపు రూ.300 కోట్లు మంజూరైనట్లు మంత్రి పట్టణంలో 13 వేల ఇళ్లు నిర్మించడంతోపాటు వివిధ అభివృద్ధి పనులకు రూ.11 కోట్లతో పనులను ప్రారంభించేందుకు ఇఫ్తార్ విందు సందర్భంగా సిఎం భూమిపూజ నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ పనులన్నీ 90 రోజుల నుండి 120 రోజుల్లో పూర్తి చేయాలని సిఎం ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. పెండింగ్‌లో ఉన్న పనులకు సంబంధించి అధికారులు ప్రతిపాధనలు పంపాలని, పేరుమోసిన ఆకర్షణీయ పట్టణాలైన విశాఖ, తిరుపతి తరహాలో నంద్యాలను కూడా స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామన్నారు. 13 వేల ఇళ్ల నిర్మాణంలో అధునాతన పరిజ్ఞానంతో షేర్‌వాల్ పద్ధతిలో అతుకులు లేని గోడలతో ఇళ్లు నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం అదే ఖ రీదుకు గృహాలు నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. చామకాల్వ, కుందూనదిలో పూడికతీత పనులు కూడా చేపట్టబోతున్నామన్నారు. కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ నంద్యాలలో రోడ్ల విస్తరణ పనులు త్వరితగతిన చేపట్టబోతున్నామని, మెయిన్ రోడ్లే కాకుండ అంతర్గత రోడ్ల నిర్మాణం కూడా చేపడతామన్నారు. అంగన్‌వాడీలకు వౌలిక సదుపాయాలు కల్పిస్తామని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు త్వరలో చేపడుతామన్నారు. ఈ సమావేశంలో జెసి ప్రసన్న వెంకటేష్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ కన్నబాబు, జెడ్పి సిఇఓ ఈశ్వర్, ఆర్డీవో రామసుందర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.