హైదరాబాద్

జడివాన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చార్మినార్, జూన్ 22: మహానగరంలో గురువారం వరుస జల్లులు కురిశాయి. సాయంత్రం ఐదు గంటల వరకు ఎండ దంచికొట్టిన తర్వాత మేఘాలు కమ్ముకుని జల్లులు కురిశాయి. శివార్లలో ఓ మోస్తరు వర్షం కురిసింది. చిన్నపాటి వర్షానికే నగరంలోని పలు మెయిన్‌రోడ్లలో భారీగా వర్షపు నీరు నిలిచిపోయంది. ఫలితంగా ట్రాఫిక్ రాకపోకలకు తీవ్రస్థాయిలో అంతరాయమేర్పడింది. ఆరు గంటల ప్రాంతంలో బలమైన గాలులు వీశాయి. సిటీలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రివరకు మూడుసార్లు జల్లులు కురిశాయి. ఖైరతాబాద్, అమీర్‌పేట, రాణిగంజ్, లక్డీకాపూల్, సికిందరాబాద్, ప్యారడైజ్, బైబిల్‌హౌస్, బేగంపేట, ఎం.జె.మార్కెట్, కోఠి, పాతబస్తీలోని చార్మినార్, లాల్‌దర్వాజ, హుస్సేనీ ఆలం తదితర ప్రాంతాల్లో రోడ్డుపై వర్షపు నీరు నిలవటంతో రాకపోకలకు అంతరాయమేర్పడింది. పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో రంజాన్ షాపింగ్‌కు అంతరాయమేర్పడింది. రంజాన్ నైట్ బజార్లను ఏర్పాటు చేసిన చార్మినార్, మదీనా, లాడ్‌బజార్, గుల్జార్ హౌస్, షాపింగ్‌కు అంతరాయమేర్పడింది.