హైదరాబాద్

బోనాల సమన్వయానికి వాట్సప్ గ్రూప్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, చార్మినార్, జూన్ 22: ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని నగరంలో అత్యంత ఘనంగా జరిగే బోనాల జాతర ఏర్పాట్లలో వివిధ శాఖల అధికారుల మధ్య సమన్వయాన్ని పెంపొందించేందుకు ప్రత్యేకంగా వాట్సప్ గ్రూప్‌లను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన బోనాల ఏర్పాట్లపై సాలార్‌జంగ్ మ్యూజియం ఆడిటోరియంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాతబస్తీలో వచ్చే నెల 16 నుంచి బోనాల ఉత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సారి లాల్‌దర్వాజ, అక్కన్నమాదన్న, బంగారు మైసమ్మ, భాగ్యలక్ష్మీ అమ్మవార్లకు ఈ సారి సర్కారు తరపున పట్టువస్త్రాలను సమర్పించనున్నట్లు ఆయన తెలిపారు. లాల్‌దర్వాజ అక్కన్నమాదన్న దేవాలయం, మీరాలం మండి ముత్యాలమ్మ ఆలయం, మీర్‌చౌక్ ముత్యాలమ్మ ఆలయం, హుస్సేనీ ఆలం ముత్యాలమ్మ ఆలయం, గౌలీపురా మహాంకాళీ మాతేశ్వరి ఆలయాలకు చెందిన కమిటీ సభ్యులు హజరై ఆయా ప్రాంతాల్లో కావల్సిన అవసరాల గురించి అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఆయా దేవాలయాల కమిటీ సభ్యులు చెప్పిన సమస్యలను స్థానికంగా ఉన్న అధికారులు నమోదు చేసుకుని వాటిని 48 గంటల్లో పరిష్కరించి తమకు సమాచారం అందించాలని మంత్రి ఆదేశించారు. నగరంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఈ బోనాలకు ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు. ఏర్పాట్లలో శాఖల మధ్య సమన్వయం పెంపొందించేందుకు గత నెలరోజులుగా గోల్కొండ, సికిందరాబాద్, పాతబస్తీ బోనాల ఏర్పాట్లపై సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. వచ్చే నెల 16,17 తేదీల్లో జరిగే పాతబస్తీ బోనాలకు పోలీసు శాఖ కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. చార్మినార్ ప్రత్యేక ఆకర్షణగా కన్పించేందుకు వీలుగా ప్రత్యేక లైటింగ్‌ను వ్యవస్ధను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకు గాను 3వేల మంది పోలీసులు సేవలందించనున్నట్లు ఆయన వెల్లడించారు. అందులో డిఐజి స్థాయ ఇద్దరు, ఎస్పీ స్థాయి ఐదుగురు, డిఎస్పీ స్థాయి 20 మంది, సిఐ స్థాయి అధికారులు 50 మంది, ఎస్‌ఐ స్థాయి వారు 175 మంది, ఇతర రెండు వేల మంది పోలీసు సిబ్బంది బందోబస్తు చేపట్టనున్నట్లు తెలిపారు. వీరితో పాటు ప్లాటూన్‌కు 21 మంది చొప్పున 25 ప్లాటూన్ల అదనపు బలగాలు, వారిలో ఒక్కో ప్లాటూన్‌కు 130 మంది సామర్థ్యం కల్గిన రెండు ర్యాపిడ్ యాక్షన్ బృందాలు విధులు నిర్వర్తించనున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం ఇద్దరు ఏసిపి స్థాయి అధికారులు, సిఐ స్థాయిలో ఎనిమిదిమంది విధులు నిర్వర్తించనున్నట్లు వెల్లడించారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్లు అందుబాటులో ఉంచుతామని, అదనపు వెలుగుల కోసం 4వేల తాత్కాలిక ఎలోజిన్ లైట్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. సమావేశంలో హైదరాబాద్ ఆర్డీవో చంద్రకళ, దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణ, అసిస్టెంటు కమిషనర్ బాలాజీ, జలమండలి సిజిఎం రవి, విద్యుత్ శాఖ సిజిఎం విద్యాసాగర్, ఆర్టీసి రీజినల్ మనేజర్ వెంకటేశం, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, ఎఫ్‌డిసి జెఎండి కిషోర్‌బాబు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
సాంస్కృతిక ప్రదర్శనలు
పాతబస్తీ బోనాల జాతరలో భాగంగా ప్రజలను ఆకట్టుకునేందుకు రాష్ట్ర భాసా, సంస్కాృతిక శాఖ ఆధ్వర్యంలో పాతబస్తీలో 50వేదికలను ఏర్పాటు చేసి ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని తెలిపారు. తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఈ ప్రదర్శలుంటాయన్నారు.