హైదరాబాద్

వెబ్‌సైట్‌లో భార్యతో శృంగార దృశ్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, జూన్ 22: ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడన్న చందంగా ఇంట్లో బెడ్‌రూంలో భార్యతో గడిపిన దృశ్యాలను చిత్రీకరించి వెబ్‌సైట్‌లో పెట్టి ఆనందిస్తున్న నిందితుడికి పోలీసులు ఆరదండాలు వేశారు. భార్య స్నానం చేస్తున్న సమయంలోను, బెడ్‌రూంలో శృంగారాలను చిత్రీకరించి పోర్న్‌సైట్‌లో పెట్టిన నిందితుడిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. సైబరాబాద్ సైబర్ క్రైం ఎసిపి జయరాం కథనం మేరకు... మేడ్చర్ జిల్లా శామీర్‌పేటకు చెందిన కృష్ణచైతన్యకు కర్నూలుకు చెందిన యువతిలో 2016 మార్చిలో వివాహం జరిగింది. పోర్న్ సైట్లకు బానిసైన కృష్ణచైతన్యకు తమిళనాడుకు చెందిన శ్రీమాన్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ అశ్లీల చిత్రాలను షేర్ చేసుకోవడంతో పాటు ఇంటి విషయాలను సైతం షేర్ చేసుకుని ఆనందించే వారు. ఇద్దరూ తమ భార్యలకు చెందిన బెడ్‌రూం, బాత్‌రూమ్‌లో స్నానం చేస్తున్న ఫోటోలు, వీడియోలను షేర్ చేసుకునే వారు. ఎడాది కాలం నుంచి వీడియోలు, ఫొటోలను షేర్ చేసుకుంటున్నారు. ఈ నగ్న చిత్రాలు సైట్లో హాల్‌చల్ చేస్తుండడంతో యువతి... స్నేహితులు, బంధువులు చిత్రాల గురించి తెలియచేయడంతో మొదట నమ్మక పోయినప్పటికీ తరువాత వీడియోలను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. బెడ్‌రూమ్, స్నానం చేస్తున్నప్పటి చిత్రాలు ఎవరు తీసి ఉంటారని ఆలోచించి చివరికి సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్న సమయంలో భర్తే నిందితుడని తేలింది. కృష్ణచైతన్యను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.