హైదరాబాద్

ఎమర్జెన్సీలో పోరాడిన వారిని గుర్తించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: భారత్ సురక్షా సమితి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం తెలుగు విశ్వవిద్యాలయంలో ఎమర్జెన్సీ సమయంలో పోరాడిన వారిని గుర్తించి సత్కరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ ఎమర్జెన్సీలో పోరాడిన వారిని స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తించే అంశం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయమని, ఈ విషయంలో అవసరమైతే తాను కూడా ఢిల్లీకి వచ్చి పోరాడతానని అన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున తాము కూడా రికమెండ్ చేస్తామని నాయని హామీ ఇచ్చారు. సంస్థ అధ్యక్షుడు శివకుమార్ యాదవ్ పాల్గొన్నారు.