రంగారెడ్డి

అయ్యో.. ‘పాప’ం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేవెళ్ల, జూన్ 22: చేవెళ్ల మండలం చన్‌వళ్లిలో బోరు బావిలో చిన్నారి పడిపోయన ఉదంతం తెలిసిన వెంటనే.. షాబాద్ మండల కేంద్రంలో ఇప్తార్ విందులో పాల్గొన్న మంత్రి మహేందర్‌రెడ్డి, కలెక్టర్ రఘునందన్‌రావు సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకొన్నారు. వివరాలు అడిగి తెలుసుకొన్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత సహాయ చర్యలు అధికారులతో కలిసి చర్యలను పర్యవేక్షిస్తునారు. 108 సిబ్బంది అక్కడికి చేరుకొని పైపుల ద్వారా ఆక్సిజన్ అందిస్తున్నారు. రెండు జెసిబిలు, ఒక హిటాచీలను తెప్పించి బోరుబావికి సమాంతరంగా తవ్వకాలు చేపట్టారు. చేవెళ్ల ఆర్డీవో వెంకటేశ్వర్లుతో పాటు సిఐ గురువయ్య, శ్రీనివాస్‌లు, చేవెళ్లతో పాటు షాబాద్, శంకర్‌పల్లి, మొయినాబాద్ మండలాలకు చెందిన పోలీసు సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. మంత్రితో పాటు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు అధికారులు అక్కడే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు.