రంగారెడ్డి

ఉజ్వల హోం నుంచి మహిళా నేరస్థుల పరార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, జూన్ 22: వివిధ నేరాల్లో పట్టుబడి హోంలో ఉంటున్న మహిళా నేరస్థులు.. శిక్షకులపై దాడి జరిపి వేర్వేరు గదుల్లో బంధించి పరారైన సంఘటన ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలోని పద్మావతినగర్ కాలనీలో గురువారం జరిగింది. ఉప్పల్ పోలీసుల కథనం ప్రకారం.. కాలనీలోని ఉజ్వల హోంలో నగరంలోని వివిధ పోలీసుస్టేషన్ పరిధిల్లో వ్యభిచార వృత్తులు నిర్వహిస్తూ పట్టుబడిన 12మంది మహిళలు శిక్షణ పొందుతున్నారు. వారికి వివిధ వృత్తులపై శిక్షణ ఇవ్వటంతో పాటు శిక్ష కాలం పూర్తవుతుంది. కాగా.. హోంలో ఉంటున్న 12మంది మహిళా నేరస్థులు హోంలో శిక్షకులుగా పని చేస్తున్న లలిత, సుబ్బలక్ష్మి, సంతోష, శోభలపై దాడులకు దిగి గాయపరిచారు. అంతటితో ఆగకుండా మహిళా శిక్షకులను వేర్వేరు గదుల్లో బంధించి గోడ దూకి పారిపోయారు. పారిపోయిన మహిళా నేరస్థులు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందినవారని.. వారిలో సంధ్య, స్వప్న, లగునీ, వర్షినంది, హసినాబేగం, అన్సారి, సుల్తాన, చందన, రహేనాలతో పాటు మరో నలుగురు మహిళలు ఉన్నట్లు తెలిపారు. పారిపోయిన మహిళల కోసం ఉప్పల్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఉజ్వల హోం ఇన్‌చార్జి అనురాధ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఉప్పల్ ఇన్‌స్పెక్టర్ నర్సింగ్ రావు తెలిపారు.