భక్తి కథలు

స్వామియే శరణం అయ్యప్పా! - 65

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలయ సమీపంలో వున్న పుష్కరిణిలో స్నానం ఆచరించడంవల్ల చర్మరోగాలు నయమవుతాయని ప్రజల నమ్మకం! ఈ క్షేత్రం జీవి హృదయస్థానంలో వుండే వాయుతత్త్వంతో కూడిన అనాహత చక్రానికి ప్రతీకగా స్థల పురాణంలో చెప్పబడింది!
2.ఆర్యన్‌గావ్- కుళత్తపుల క్షేత్రానికి సుమారు పద్ధెనిమిది మైళ్ల దూరంలో వున్న ఈ క్షేత్రంలో కళ్యాణమూర్తిగా పూర్ణా, పుష్కళా దేవేరుల సహితంగా దర్శనమిస్తాడు అయ్యప్పస్వామి! ప్రతి సంవత్సరం ఇక్కడ స్వామి, దేవేరుల కళ్యాణం వైభవంగా జరుపుతారు! జీవి నాభి స్థానంలో వుండే అగ్నితత్వం గల మణిపూరక చక్రానికి ఈ క్షేత్రం ప్రతీకగా చెప్పబడింది!
3.అచ్చన్ కోవిల్:జలతత్త్వమైన, నాభికి క్రిందగా వుండే స్వాధిష్టాన చక్రానికి ప్రతీకగా వెలసి వున్న ఈ క్షేత్రంలో రుద్రాక్ష శిలారూపంలో వెలసి వున్న అయ్యప్పస్వామి గృహస్థుగా పూజింపబడుతున్నాడు!
4.ఎరుమేలి: ఇక్కడ ఆలయంలో ధర్మశాస్తా కిరాత పురుషునిగా (వేటగాడు)గా దర్శనమిస్తాడు. ఈ ఎరుమేలిలోనే అయ్యప్పస్వామి మిత్రుడైన వావరు గుడి వున్నది! శబరిమల యాత్రలో భక్తులందరూ ఎరుమేలి చేరి అయ్యప్ప ఆటవిక పురుషుని రూపంలో వున్నందువల్ల తాము కూడా ఆటవిక వేషాలు ధరించి, తాము తీసుకువెళుతున్న ఆయుధాలను చేతబట్టి (కత్తి, గద, బాణం మొదలైనవి) అయ్యప్ప భజన చేస్తూ నాట్యం చేస్తుంటారు. దీన్ని ‘వేటతుళ్లి’ అంటారు! ఈ విధంగా చేయడంవల్ల స్వామి అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం! జీవి శరీరంలోని పృథ్వీతత్వమైన మూలాధార చక్రానికి ప్రతీకగా ఈ స్థానం చెప్పబడింది!
5.శబరిమల: జీవి కనుబొమ్మల మధ్య వుండే ఆజ్ఞా చక్రానికి ప్రతీకగా శబరిమల! ఇక్కడ స్వామి జ్యోతి రూపంలో మకర సంక్రాంతినాడు దర్శనం ప్రసాదిస్తాడు!
ఈ ఐదు క్షేత్రాలేగాక పంబల రాజ్యంలోని ధర్మశాస్తా ఆలయం వెలసి వున్న ప్రాంతం జీవి కంఠ ప్రదేశంలో వుండే ఆకాశ తత్వాన్ని గల విశుద్ధి చక్రానికి ప్రతీకలా చెప్పబడింది. ఇక్కడ స్వామిని బాలశాస్తాగా పూజించడం ఆనవాయితీ!
కేరళ రాష్ట్రంలో ప్రధానమైన అయ్యప్ప క్షేత్రాలు అవి! ఇక ఇప్పుడు దక్షిణాపథంలోని ఇతర రాష్ట్రాలో గూడా అయ్యప్పస్వామికి ఎన్నో గుడులు నిర్మించబడ్డాయి. భక్తులు కూడా ఎక్కువైనారు! దీక్షాధారులే కాక అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్లే భక్తులతో కార్తీకమాసం నుండి శబరిమలకు వెళ్ళేదారులంతా జన సందోహంతో నిండి వుంటుంది!’’ చెప్పాడు సుబ్బారావుగారు.
‘‘తాతయ్యా! శబరిమల యాత్ర ఎట్లా చేస్తారో చెప్పండి! ముందుగా ఆ విశేషాలు తెలుసుకుంటే నేను వెళ్దామనుకున్నప్పుడు సులభంగా వుంటుంది గదా!’’ ఆరిందలా కళ్లు త్రిప్పుతూ అడిగాడు ప్రణవ్!
‘‘మంచి
కోరికే!
నిజానికి నీ వయసు పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా దీక్ష తీసుకుని యాత్రకు వెళుతున్నారు ఈమధ్య! మొన్న గుడిలో చూసావు కదా! అందుకే నీకు ఆ ఉద్దేశ్యం కలిగింది! తప్పకుండా వెళుదువుగానిలే, ముందు నువ్వు అడిగిన యాత్ర విషయాలు చెబుతాను! విను మరి!’’ అంటూ గొంతు సవరించుకుని మొదలుపెట్టారు సుబ్బారావుగారు!
***
శబరిమల యాత్ర విషయాలు
పూర్వకాలంలో శబరిమల యాత్ర చేయడం చాలా కష్టంగా వుండేది! క్రూరమృగాలతో నిండిన ఘోరారణ్యాల మధ్య, ముళ్లతో నిండిన సన్నని కాలిబాటల వెంట కాలినడకన సుమారు 50 కి.మీ ప్రయాణం చేయాల్సి వచ్చేది! అయినా ‘స్వామియే శరణం అయ్యప్ప’ అని పలుకుతూ, మార్గాయాసాన్ని లెక్కచేయకుండా మూడు రోజులు నడిచి శబరిమలను చేరుకునేవాళ్లు భక్తులు! ఈ మార్గాన్ని ‘పెద్దపాదం’ అని వ్యవహరిస్తారు!
యాత్రకు పురుషులకు వయస్సు పరిమితి లేదు! పిల్లలను కూడా తీసుకువెళ్లవచ్చును. స్ర్తిలు మాత్రం 12 నుండి 50 సంవత్సరాల వయస్సు వారు యాత్ర చేయరాదన్న నియమం వున్నది! (ఆడపిల్లలు వ్యక్తులవ్వడానికి ముందు, స్ర్తిలు బహిష్టు ఆగిన తర్వాత మాత్రమే యాత్రకు అర్హులు)
యాత్ర ఆరంభం: ఇరుముడి తలమీద పెట్టుకుని గురుస్వామి వెంట భక్తులు శరణుఘోష చేస్తూ మొదటి మజిలీ ఎరుమేలి చేరుకుంటారు!
మొదటిరోజు మజిలీ ఎరుమేలి:ఈ క్షేత్రాన్ని చేరగానే అందరిలో ఉత్సాహం పొంగులువారుతుంది. ఇక్కడ కిరాత వేషంలో వున్న వేట శాస్తా గుడి, స్వామి మిత్రుడైన వావరు సమాధి ఉన్నాయి. ఇక్కడ అందరూ ఇరుముడులు శుభ్రమైన స్థలంలో భద్రపరిచి, వేటగాళ్లలా వేషాలు వేసుకుని, అయ్యప్ప భజన చేస్తూ తమ వెంట తెచ్చిన ఆయుధాలు పట్టుకుని కొంతసేపు నాట్యం చేస్తారు! ఈ కార్యక్రమాన్ని ‘వేటతుళ్లి’ అంటారు. ఈ విధంగా ఆడి పాడటంవల్ల స్వామి ఆనందిస్తాడన్నది ప్రజల విశ్వాసం!
-ఇంకాఉంది