వరంగల్

ల్యాండ్ రికార్డ్స్ సర్వే వివరాలు అందజేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, జూన్ 23: జిల్లాలో ల్యాండ్ రికార్డ్స్ సర్వే పూర్తి వివరాల జాభితాను పొందుపర్చాలని కలెక్టర్ డాక్టర్ తహశీల్దార్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో తహశీల్దార్లు, డిప్యూటి ఇన్‌స్పెక్టర్స్, సర్వేయర్స్‌తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రతి గ్రామపంచాయితీ పరిధిలో ఎంతభూమి ఉందనేది విఆర్వోల ద్వారా సర్వే చేయించి భూమిని గుర్తించి అట్టి వివరాలను రికార్డ్స్ రూపంలో పొందుపర్చి తెలియజెప్పాల్సిన బాధ్యత రెవిన్యూశాఖ ప్రధమ కర్తవ్యమని అన్నారు. జిల్లాకు కలెక్టర్ పూర్తి అధికారి అయితే మండలానికి తహశీల్దారు ప్రధములని ఆమె చెప్పారు. వ్యవసాయ శాఖ నిర్వహించిన రైతు సమగ్ర సర్వేకు, రెవిన్యూ రికార్డ్స్‌కు పొంతన లేకుండా భూమి వివరాలు, సర్వే, 1బి, పట్టాలు ఉన్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 12వందల సాదాబైనామాలు పూర్తిచేయగా, 30వేల సాదాబైనామాలకు పాస్‌బుక్స్ పంపిణీ చేయాల్సి ఉందంటూ అధికారుల అలసత్వంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ నెలలో పూర్తిచేయాలని సంబందిత అధికారులను ఆదేశించారు. ఒక గ్రామాన్ని మోడల్‌గా ఎంపికచేసుకొని గ్రామ చిత్రపటాన్ని ఏర్పరుచుకోవాలని అన్ని రకాల వసతులపై అన్ని శాఖల మండల అధికారులు వృత్తి ధర్మంగా పనిచేస్తూ సమస్యలు పరిష్కరిస్తూ జిల్లా అభివృద్ధికి తొడ్పాటు అందించాలన్నారు. వర్షాకాలం వ్యవసాయానికి అనువైందని కరెంట్‌కు అంతరాయం ఏర్పడకుండా సాగునీరు, తాగునీరు పైపులైన్స్ లికేజి కాకుండా, నకిలీ విత్తనాలు ఎరువుల వలన రైతులు మోసపొకుండా ఎప్పటికప్పుడు తహశీల్దార్‌గా ఉంచాలన్నారు. ప్రజావాణిలో తప్పుడు ఖాతా నెంబర్‌పై చాలా పిర్యాదులు వస్తున్నాయన్నారు. ల్యాండ్ రికార్డ్స్ సర్వే ద్వారా జాగ్రత్తగా ఎలాంటి సర్వే, 1బి, పట్టాల తప్పులు లేకుండా సరిచేయాలన్నారు. అన్ని అర్హతలున్నప్పటికి ఇప్పటికి ఇంకా పట్టాకాని సర్వే నెంబర్‌లపై కలెక్టర్ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. మిషన్ కాకతీయతో ఆయకట్టులు పెరిగాయని, అట్టి వివరాలను ఆర్‌డివోలకు పంపాలని, ఎస్‌ఆర్‌ఎస్‌పి నీటిని చెరువులకు చేర్చుటకు చర్యలు చెపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి మండలాల్లో వచ్చే గుడుంబా కేసుల వివరాల లిస్ట్‌లు అందజేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జెసి దామోదర్‌రెడ్డి, డిఆర్‌వో రాం బాబు, ఆర్డివోలు కృష్ణవేణి, భాస్కర్‌రావు, సూపరింటెండెంట్ రాఘవరెడ్డి, వివిధ మండలాల తహశీల్దార్లు, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్, సర్వేయర్స్ తదితరులు ఉన్నారు.