అనంతపురం

ప్రభుత్వాసుపత్రుల్లో కార్పొరేట్ వైద్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, జూన్ 23 : రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులను అన్నివిధాలా అభివృద్ధి చేసి పేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం స్థానిక జిల్లా స్థాయి ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో రూ.20 కోట్లతో నిర్మించిన మాతా,శిశు ఆసుపత్రి సముదాయాన్ని మంత్రితోపాటు ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ జెఇ వెంకటస్వామి, సూపరింటెండెంట్ డాక్టర్ కేశవులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ బాలకృష్ణ లాంటి మంచి వ్యక్తిని ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం వల్ల హిందూపురం సర్వతోముఖాభివృద్ధి చెందుతోందన్నారు. నూతనంగా ప్రారంభిం చి మాతా,శిశు ఆసుపత్రిలో 150 పడకలు, ఇప్పటికే ఉన్న ఆసుపత్రి సముదాయంలో 100 పడకలు ఉండటం హిందూపురం ప్రత్యేకత అన్నారు. బా లకృష్ణ సూచన మేరకు అవసరమైతే మరో వంద పడకలను మంజూరు చేయనున్నట్లు తెలిపారు. మెడికల్ కళాశాలల తరహాలో హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్ కేం ద్రం తదితర సదుపాయాలు ఉండట ం ఎంతో గర్వకారణమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల ఆరోగ్యా న్ని దృష్టిలో ఉంచుకుని ఎక్కడా లేనివిధంగా 26 వైద్య, ఆరోగ్య కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. పౌష్ఠికాహార లోపం వల్ల బిడ్డలు మృత్యువాత పడుతుండటంతో కేంద్ర ప్రభుత్వ నిధులతో మాతా,శిశు ఆసుపత్రిని నిర్మించినట్లు తెలిపారు. అలాగే గతంలో కంటే ప్రస్తుతం స్థానిక ఆసుపత్రిలో ఓపి విభాగం, ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. హిందూపురం ప్రభుత్వాసుపత్రి అభివృద్ధికి దాతల సహకారం మరవలేనిదన్నారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ తాను ఎక్కడ ఉన్నా నాన్న ఎన్టీ రామారావు స్ఫూర్తితో హిందూపురం నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నానన్నారు. మనదేశంలో ఉన్నంత యువ సంపద అభివృద్ధి చెందిన అమెరికా, చైనా వంటి దేశాల్లో కూడా లేదన్నారు. అలాగే పట్టణ నీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం గొల్లపల్లి రిజర్వాయర్ నుండి నీటిని తీసుకొచ్చేందుకు రూ.167 కోట్లు మంజూరు చేయించడంతోపాటు 0.3 టిఎంసిల నీటి కేటాయించినట్లు తెలిపారు. ఇకపోతే పట్టణంలో నూతనంగా రూ.23 కోట్లతో కూరగాయల మార్కెట్ నిర్మాణానికి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ ఎమ్మెల్యే బాలయ్య నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తున్నారని ప్రశంసించారు. జిల్లాస్థాయిల్లో కూడా లేనివిధంగా స్థానిక ప్రభుత్వాసుపత్రిలో వివిధ సదుపాయాలు కల్పించడం స్థానికుల అదృష్టమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ గౌస్‌మోద్దీన్, రాష్ట్ర బిసి కార్పొరేషన్ ఛైర్మన్ పామిశెట్టి రంగనాయకులు, మున్సిపల్ చైర్‌పర్సన్ రావిళ్ల లక్ష్మి, వైస్ చైర్మన్ జెపికె రాము, డిసిహెచ్‌ఎస్ రమేష్‌నాథ్, డిఎంహెచ్‌ఓ వెంకటరమణ, మార్కెట్‌యార్డు చైర్మన్ కిష్టప్ప, మాజీ ఎమ్మెల్యే అబ్ధుల్‌ఘనీ, టిడిపి నేతలు అంబికా లక్ష్మీనారాయణ, ఏ.నాగరాజు, నంబూరి సతీష్, షఫీవుల్లా, జెవి అనిల్‌కుమార్, దేమకేతేపల్లి అంజినప్ప, బండారు బాలాజీ, సుశీలమ్మ, నెట్టప్ప, కొండూరు మల్లికార్జున, తిమ్మయ్య, అమర్‌నాథ్, డిఇ రమేష్‌కుమార్ పాల్గొన్నారు.
దాతలకు సన్మానం
స్థానిక ప్రభుత్వాసుపత్రి అభివృద్ధికి రూ.లక్షలు వితరణ చేసిన దాతలను మంత్రి కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఘనంగా సన్మానించారు. ఐదు హైమాక్స్ ఎల్‌ఇడి లైట్లను వితరణగా ఇచ్చిన ముద్దిరెడ్డిపల్లికి చెందిన పల్లా లక్ష్మీకుమార్, విశ్రాంతి భవన సముదాయ నిర్మాణానికి కృషి చేసిన డాక్టర్ బాలాజీ కుటుంబ సభ్యులను, సకాలంలో మాతా, శిశు ఆసుపత్రిని భవన నిర్మాణాన్ని పూర్తిస్థాయి నాణ్యతతో నిర్మించిన కాంట్రాక్టర్ రాజు సన్మానించారు. అదేవిధంగా గతేడాది ఉత్తమ వైద్య సేవలు అందించి రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచి కాయకల్ప అవార్డు దక్కించుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ అభివృద్ధి కమిటీ సభ్యులు, వైద్యులకు మంత్రి, బాలకృష్ణ మెమొంటో అందజేశారు. అనంతరం ఆసుపత్రి అభివృద్ధికి ఎంతో సహకరించిన మంత్రి కామినేని, ఎమ్మెల్యే బాలకృష్ణలను ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ జెఇ వెంకటస్వామి ఆధ్వర్యంలో సభ్యులు, వైద్యులు ఘనంగా సత్కరించారు.
‘బుల్లేట్ బాలయ్య’!
మూడు రోజుల పర్యటన సందర్భంగా శుక్రవారం ఉదయం కొడికొండ చెక్‌పోస్టు నుంచి ఎమ్మెల్యే బాలకృష్ణ స్వయంగా బుల్లెట్ నడుపుతూ అభిమానులు, కార్యకర్తలను హుషారెత్తించారు. ఎమ్మెల్యే వెనుక టిడిపి నాయకులు అన్సార్ అహ్మద్ కూర్చోగా బాలయ్య విక్టర్ గుర్తు చూపిస్తూ వాహనాన్ని నడిపారు. పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు సైతం ద్విచక్ర వాహనంలో ఎమ్మెల్యేను అనుసరించారు. దాదాపు ఐదు కిలోమీటర్ల మేర బుల్లెట్ నడిపిన ఎమ్మెల్యే అనంతరం తన వాహనాన్ని ఎక్కి హిందూపురం చేరుకున్నారు.