కర్నూల్

మద్దులేటయ్య క్షేత్రంలో ఘనంగా తిరుచ్చి వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బేతంచెర్ల, జూన్ 23:మండల పరిధిలోని ఆర్‌ఎస్ రంగాపురం గ్రామశివారులో వెలసిన శ్రీమద్దులేటి నరసింహ్మస్వామి ఆలయంలో శుక్రవారం తిరుచ్చి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేకువజామున శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, మహామంగళహారతి, విశేష పూజలు నిర్వహించారు. సాయంత్రం శ్రీస్వామి వారికి ప్రత్యేక అలంకరణ చేసి పల్లకిలో కొలువుదీర్చి ఆలయ ప్రాంగణం మాడా వీధుల గుండా భాజాభజంత్రీల మధ్య అంగరంగ వైభవంగా ఊరేగింపు నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ గావించారు. ఆయా కార్యక్రమాల్లో ఆయల ప్రధాన అర్చకులు మద్దిలేటిస్వామి, అర్చక బృందం, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.