కృష్ణ

ఇసుక అక్రమ రవాణాచేస్తే పిడి యాక్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు, జూన్ 23:ప్రభుత్వ నియమ నిబంధలకు విరుద్ధంగా ఇసుకను అక్రమంగా రవాణా చేసేవారిపై పిడి యాక్టు ప్రకారం చర్యలు తీసుకుంటామని నూజివీడు రెవిన్యూ డివిజన్ అధికారి చెరుకూరి రంగయ్య హెచ్చరించారు. శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఇసుక అక్రమంగా తరలించేవారిపై ఉక్కుపాదం మోపుతామని చెప్పారు. నూజివీడు డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చిందని అన్నారు. ముఖ్యంగా తిరువూరు, గంపలగూడెం ప్రాంతాల్లో ఇసుక తరలినట్లు తెలిసిందని చెప్పారు. అక్రమ ఇసుక రవాణాచేస్తే పిడి యాక్డు ప్రకారం కేసులు నమోదు చేస్తామని, బెయిల్ కూడా మంజూరు కాదని, సంబంధిత వాహనాన్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఇసుక రవాణాన్ని అడ్డుకునేందుకు ప్రత్యేకంగా రెవిన్యూ, పోలీసులతో నిఘా బృందాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఇసుక అక్రమ రవాణా విషయంలో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, ఎవరైన అధికారులు తరలింపుదారులకు సహకరిస్తే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని ఆర్డీవో రంగయ్య హెచ్చరించారు.