హైదరాబాద్

జెట్టింగ్ యంత్రాలను పూర్తి స్థాయిలో వినియోగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 23: మహానగరంలో గల్లీగల్లీలోనూ తలెత్తే సీవరేజీ సమస్యలను పరిష్కరించేందుకు ఇటీవలే సమకూర్చుకున్న మినీ జెట్టింగ్ యంత్రాలను పూర్తి స్థాయిలో వినియోగించాలని అధికారులకు జలమండి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం.సత్యనారాయణ సూచించారు. మినీ జెట్టింగ్ యంత్రాల వినియోగంపై ఖైరతాబాద్‌లోని బోర్డు ప్రధాన కార్యాలయంలో ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. యంత్రాలు పనిచేస్తున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య సమస్యలపై వచ్చే ఫిర్యాదులను మినీ జెట్టింగ్ యంత్రాలతో పరిష్కరించాలని సూచించారు. ప్రతి రోజు ఏఏ ప్రాంతంలో, ఎంత మందం పైప్‌లో, ఏ సమయంలో ఈ యంత్రాలను వినియోగించారనే సమాచారంతో కూడిన లాగ్‌బుక్‌ను మెయింటెన్ చేయాలని ఆదేశించారు. చౌకేజీ నివారణకు ఎంత సమయం పట్టిందో ఆ లాగ్‌బుక్‌లో నమోదు చేయాలని అన్నారు. ఒప్పందం ప్రకారం ఒక్కో యంత్రం ప్రతిరోజు 500 మీటర్ల పారిశుద్ధ్య పనులు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ప్రతి జెట్టింగ్ యంత్రం వినియోగంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఇప్పటికే ఉచితంగా ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా చేస్తున్న బస్తీల వివరాలతో పాటు అక్కడ పైప్‌లైన్ల విస్తరణ కోసం అవసరమైన చర్యలు, ప్రణాళికలను రూపొందించి తమకు వారం రోజుల్లో సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో జలమండలి టెక్నికల్ డైరక్టెర్ డా.పిఎస్ సూర్యనారాయణ, ఆపరేషన్స్ డైరెక్టర్ అజ్మీరా కృష్ణ, అధికారులు ఎ.ప్రభాకర్ పాల్గొన్నారు.