హైదరాబాద్

ప్రపంచంలో సమస్తం లక్ష్మీ ప్రసాదమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిక్కడపల్లి, జూన్ 23: ప్రపంచంలో సమస్తం లక్ష్మీ ప్రసాదమేనని గణేశ పీఠాధిపతి విద్యాగణేశానంద భారతీ స్వామి అన్నారు. శుక్రవారం ఇందిరాపార్కు వద్ద ఎన్టీఆర్ స్టేడియంలో ఆచార్యసేతు ఆధ్వర్యంలో ప్రారంభమయిన శ్రీమహాలక్ష్మీ యాగంలో అహోబిలం రామానుజ జీయర్ స్వామితో కలసి పాల్గొన్నారు. ప్రకృతి నుండి విద్య, ధనం అన్నీ లక్ష్మీ ప్రసాదమేనని, అందుకే లక్ష్మిని ప్రకృత్యైనమః అంటూ కొలుస్తామని వివరించారు. లక్ష్మీదేవికి మనం తిరిగి ఏమీ ఇవ్వలేమని అన్నారు. రామానుజ జీయర్ స్వామి మాట్లాడుతూ ధనం ఉన్నంత మాత్రాన ధనవంతుడు కాలేడని, భగవంతుడిని గుర్తించగలిగిన వాడే నిజమైన ధనవంతుడని అన్నారు. విద్యాలయాల ద్వారా విద్యను, వైద్యాలయాల ద్వారా ఆరోగ్యాన్ని ఎలా పొందుతామో అలాగే దేవాలయాల నుండి మానసిక బలాన్ని పొందుతామని తెలిపారు. మన సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవలసిన బాద్యత మనందరిపైనా ఉందని, దానికై దేవాలయాలు, యఙ్ఞ యాగాదులు దోహదపడతాయని వివరించారు. యాఙ్ఞ నిర్వాహకులు, ప్రముఖ టివి ఆర్టిస్ట్ లోహిత్ మాట్లాడుతూ విశ్వశాంతి కొరకు నిర్వహిస్తున్న శ్రీ మహాలక్ష్మీ యాగం మూడురోజుల పాటు జరుగుతుందని వివరించారు. ఉదయం లక్ష్మీ గణపతి హోమంతో ప్రారంభమయిన కార్యక్రమం శ్రీలక్ష్మీ నారాయణ హోమంతో శుక్రవారం ముగుస్తుందని, శనివారం శ్రీలక్ష్మీ నృసింహ హోమం, శ్రీలక్ష్మీ కుబేర హోమం జరుగుతాయని వివరించారు. మూడు రోజుల పాటు జరిగే యాగంలో అనేక మంది స్వామీజీలు, వేద పండితులు పాల్గొంటారని తెలిపారు. మొదటి రోజు కార్యక్రమంలో బిసి కార్పొరేషన్ చైర్మన్ రాములు, సభ్యులు వకుళాభరణం కృష్ణమోహన్, మ్యూజిక్ డైరెక్టర్ శశిప్రీతం, ప్రముఖ గాయని ప్రత్యూషశర్మ, వాలంటీర్స్ రాజారెడ్డి, పూజాచౌదరి, శ్రీనివాస్ పాల్గొన్నారు.