హైదరాబాద్

పారదర్శకమైన సేవలకు ఫీడ్‌బ్యాక్ సెంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, జూన్ 23: పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసేవారికి పారదర్శకమైన సేవలందించేందుకు సిటిజెన్ ఫీడ్‌బ్యాక్ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ త్రివేది చెప్పారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన సిటిజెన్ ఫీడ్‌బ్యాక్ సెంటర్‌ని ప్రారంభించారు. త్రివేది మాట్లాడుతూ పోలీసుల్లో ఆత్మవిశ్వాం నింపడంతో పాటు జవాబీదారుతనం పెంచి, పని తీరును మెరుగు పరుచుకోవడానికి సెంటర్ ఉపయోగపడుతుందని తెలిపారు. త్వరలో 18290 మంది కానిస్టేబుళ్లను నియమించనుందని చెప్పారు. నియమాకాలతోన ప్రభుత్వంపై 1000 కోట్ల వరకు భారం పడుతుందని, అయినప్పటికీ శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. రానున్న కాలంలో సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కనుందని తెలిపారు. ఆర్ట్ఫిషల్ ఇంటిలిజెన్స్ (కృత్రిమ మేధ) ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇమేజ్ వస్తుందని అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసు శాఖ వినియోగించుకుంటే మంచి ఫలితాలు సాధించ వచ్చాని అన్నారు. సైబరాబాద్ జాయింట్ పోలీసు కమిషనర్ షానవాజ్ ఖాసిమ్ మాట్లాడుతూ సిటిజెన్ ఫీడ్‌బ్యాక్ సెంటర్ సేవలో మొదట్లో కొంత ఇబ్బంది కలిగించిన భవిష్యత్‌లో మంచి ఫలితాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సిటిజెన్ ఫీడ్ బ్యాక్ సెంటర్‌కు రోజుకు 150 కాల్స్ వస్తున్నాయని త్వరలో 300కాల్స్ చేసేలా చూస్తామని చెప్పారు. ఇందులో కేవలం అవుట్ గోయింగ్ కాల్స్ మాత్రం చేసుకునే వీలుందని షానవాజ్ తెలిపారు. కాల్స్ ర్యాండమ్‌గా వెళ్లడంతో కచ్చితత్వం, పారదర్శకత పెరుగుతుందని అన్నారు. సిటిజన్ ఫీడ్‌బ్యాక్ సర్వీసులతో ఎక్కువగా ఎక్కడి నుంచి ఫిర్యాదులు వస్తున్నాయో తెలుసుకునే ఆస్కారం ఉందన్నారు. క్రైం డిసిపి జానకి షర్మిళ మాట్లాడుతూ సిటిజెన్ ఫీడ్ బ్యాక్ సిస్టమ్ దేశంలో ఎక్కడ లేదన్నారు. కమిషనర్ సందీప్ శాండిల్యా మది నుండి వచ్చిన ఆలోచనని చెప్పారు. సిటిజెన్ ఫీడ్ బ్యాక్ సర్వీస్‌లతో పోలీసులకు రేటింగ్ ఇచ్చే వీలు కలుగుతుందని, నెలవారీగా ఆయా స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు పంపిస్తామని అన్నారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ల పని తీరు తెలుసుకునేందుకు ఇది కీలకంగా మారనుందని చెప్పారు. ఫోన్ చేసిన వారి వివరాలను గోప్యంగా ఉండడంతో ఫిర్యాదుదారుని అభిప్రాయాన్ని తెలుసుకునే వీలుంటుదని చెప్పారు. కార్యక్రమంలో సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ జనరల్ సెక్రెటరీ భరణితో పాటు ట్రాఫిక్ డిసిపి ఎఆర్ శ్రీనివాస్ రావు, మాదాపూర్ డిసిపి విశ్వప్రసాద్, బాలనగర్ డిసిపి సాయిశేఖర్, అడిషనల్ డిసిపి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
జీడిమెట్ల హెడ్ కానిస్టేబుల్‌కి
ప్రశంసపత్రం
సమావేశం అనంతరం హోంశాఖ కార్యదర్శి రాజీవ్ త్రివేది.. సిటిజెన్ ఫీడ్ బ్యాక్ సేవలను పరిశీలిచ్చారు. ఆ సమయంలో ఫీడ్‌బ్యాక్ నిర్వహకులు ఫోన్‌కాల్‌ను పాస్‌పోర్టు దరఖాస్తుదారునికి ఫోన్ చేశారు. కాల్ సెంటర్ మహిళ పోలీసుల గురించి విచారించారు. వచ్చిన పోలీసు అధికారి డబ్బులు అడిగారా, ఎలా మాట్లాడారు అని ప్రశ్నించినప్పడు దరఖాస్తుదారుడు పోలీసులు పని తీరుగురించి చాలా సంతోషం వ్యక్తం చేశారు. ప్రత్యక్ష ప్రచారం ద్వారా చూసిన రాజీవ్ త్రివేది.. పాస్‌పోర్టు ఎంక్వరీ చేసిన జీడిమెట్ల ఎస్‌బి హెడ్ కానిస్టేబుల్ మల్లేష్‌కి ప్రశంసాపత్రాన్ని ఇవ్వాలని నిర్ణయించారు.