రంగారెడ్డి

సమస్యలు పరిష్కరిస్తేనే బస్తీలో అడుగుపెట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, జూన్ 23: సమస్యలతో నిత్యం నరకయాతన అనుభవిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌పై అత్తాపూర్ డివిజన్ ప్రజలు తిరగబడ్డారు. శుక్రవారం అత్తాపూర్ డివిజన్ పరిధిలోని డివిజన్ అధ్యక్షుడు వనం శ్రీరామ్‌రెడ్డి ఆధ్వర్యంలో అధికారుల బృందంతో కలిసి పాండురంగానగర్, మారుతీనగర్, హుడాకాలనీ బస్తీలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారుల బృందంతో ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్, కార్పొరేటర్ రావుల విజయ జంగయ్యకు ప్రజల నుంచి చేదు అనుభవం ఎదురైంది. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారై ప్రజలు నరకయాతన పడుతున్నా కనె్నత్తి చూసిన పాపన పోలేదని మండిపడ్డారు. జెఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం కింద చేపట్టిన డ్రైనేజీ, సివరేజ్ పైపులైన్ ఔట్‌లైన్ లేకపోవడంతో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై మంత్రులు కెటిఆర్, మహేందర్‌రెడ్డికు ఎన్ని సార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ విషయంపై స్థానిక కార్పొరేటర్ విజయ చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎనిమిదేళ్లుగా డ్రైనేజీ సమస్యతో విసిగిపోయామని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ ముందు మొర పెట్టుకున్నారు. నెల రోజుల క్రితం హామీ ఇచ్చి మరిచారని, నేటికీ ఎలాంటి పనులు చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమస్యకు శాశ్వత పరిష్కారం
* ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్
జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం నిధుల కింద చేపట్టిన అంతర్గత డ్రైనేజీ పైపులైన్‌లను నిర్మాణాలను చేపట్టామని, అత్తాపూర్‌లో ఔట్‌లైన్ సమస్యతో ఈ డ్రైనేజీ సమస్య పునరావృతం అవుతుందని చెప్పారు. ఉన్నతాధికారులు, మంత్రితో చర్చిస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. అత్తాపూర్ డివిజన్‌కు ప్రత్యేకంగా రూ.2.30 కోట్ల నిధులు మంజూరు చేశామని అన్నారు.