సబ్ ఫీచర్

గెలిచేది ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈసారి మిస్ ఇండియాగా గెలిచే సుందరి ఎవరు అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొన్నది. ఈ పోటీల్లో ఢిల్లీతో సహా 30 రాష్ట్రాల నుంచి అందాల యువతులు పాల్గొన్నారు. విజేతగా ప్రకటించే ఫైనల్ విభాగం పోటీలు ముంబయిలో ఆదివారంనాడు జరుగనున్నాయి. అతిరథ మహారథులు పాల్గొనే ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ‘ సృష్టి వ్యాకరణం’ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అలాగే మిగిలిన రాష్ట్రాల నుంచి కూడా ఆయా రాష్ట్రాల సంస్కృతి ప్రతిబింబించే విధంగా కాస్ట్యూమ్స్‌తో పాల్గొన్నారు.
గెలుపు కోసం ఎదురుచూస్తున్నా..
మిస్ ఇండియా పోటీల్లో విజేతగా నిలిచే క్షణం కోసం ఎదురుచూస్తున్నానని అంటోంది ఆంధ్రప్రదేశ్ నుంచి పాల్గొన్న సృష్టి వ్యాకరణం. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన సృష్టి మోడల్ రంగంలోకి అడుగుపెట్టింది. హైదరాబాద్ సెయింట్ జోసెఫ్ స్కూల్లో చదువుకున్న సృష్టి వైజాగ్ గీతం యూనివర్శిటీలో ఉన్నత చదువులు కొనసాగించారు. పెయింటింగ్స్ వేయటం ఆమె హాబీ. మంచి బాస్కెట్ బాల్ ప్లేయర్. చక్కటి గాత్రం కూడా ఆమె సొంతం. ఈ పోటీల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న తరువాత వచ్చే ఫలితాన్ని బట్టి ప్లేబాక్ సింగర్‌గా రాణించాలని భావిస్తోంది. ఈ పోటీల్లో పాల్గొనే ముందు మిస్స్ వరల్డ్ పోటీల్లో రన్నర్‌గా నిలిచిన పార్వతిని కలుసుకుని ఈ పోటీల గురించి క్షుణ్ణంగా తెలుసుకుంది. అంతేకాదు సృష్టికి మాజీ విశ్వసుందరి సుస్మితాసేన్, ప్రియాంకచోప్రా అంటే అభిమా నం. ఆమె జంతు ప్రేమికురాలు. ఇంట్లో ‘చిచి’అని ముద్దుగా పిలుస్తారు. చిలిపితనం కూడా ఎక్కువగానే ఉంది. చదువుకునే రోజుల్లో స్నేహితుడికి రాఖీ కట్టి షాక్ ఇచ్చేసింది. అన్ని విభాగాలను దాటుకుని ఫైనల్‌కు చేరుకున్న సృష్టి వ్యాకరణం మిస్స్ ఇండియాగా గెలవాలని కోరుకుందాం.