Others

అగరుబత్తి పొగ... ఆరోగ్య సమస్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇళ్ళల్లో ప్రతి రోజు పరిమళ భరిత స్టిక్స్, అగరుబత్తి వెలిగించటం మన జీవనశైలిలో ఒక భాగమే. ఇవి చుట్టూ ఉండే ప్రాంతాన్ని సువాసనతో నింపుతాయ. పాలీ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్లు కలిగి ఉండే వీటివలన ఆస్తమా, క్యాన్సర్, జలుబు, దగ్గు వంటి ఇతరేతర ఆరోగ్య సమస్యలు కలుగుతాయని చాలా అధ్యయనాలలో వెల్లడైంది. కార్బన్ డై ఆక్సైడ్ విడుదలై, ఊపిరితిత్తుల కణాలను వాపులకు గురిచేసి శ్వాస సమస్యలను కలిగిస్తుంది.
గుండె ఆరోగ్యంలో క్షీణత
దీర్ఘకాలిక సమయం ఈ పొగను పీల్చడం వలన గుండె సంబంధిత రుగ్మతలకు లోనయ్యే అవకాశాలు 10-12 శాతం పెరిగే అవకాశముంది. సుగంధ ద్రవ్య సంబంధిత ప్రాణాంతకమైన పొగ మరమ్మతు చేయలేని విధంగా గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది!
ఆస్తమా
అగరుబత్తీల వల్ల సల్ఫర్ డై ఆక్సైడ్,కార్బన్ మోనాక్సైడ్‌లు విడుదలవుతాయి. ఇలాంటి వాయువులను పీల్చటంవలన సిఒపిడి, ఆస్తమా వంటి శ్వాస సంబంధిత సమస్యలు కలుగుతాయి.చిన్న పిల్లలు, యువకులలో చర్మ, కంటి సంబంధిత అలర్జీలు కలుగుతున్నాయి. అంతేకాకుండా సున్నితమైన చర్మం కలిగి ఉండేవారు రోజు ఈ పొగకు బహిర్గతం అవటవంలన చర్మ సంబంధిత అలర్జీలు కలుగుతున్నాయి.