సరసునిపై మోజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శింబు, నయనతార, ఆండ్రియా, ఆదాశర్మ ప్రధాన తారాగణంగా పాండీరాజ్ దర్శకత్వంలో శింబు సినీ ఆర్ట్స్, జేసన్‌రాజ్ ఫిలింస్ పతాకంపై రూపొందించిన చిత్రం ‘సరసుడు’. ఈ చిత్రానికి సంబంధించి ఆడియో ఇటీవల విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. శింబు, నాయనతార కాంబినేషన్‌తో ప్రేక్షకుల్లో క్రేజ్ ఏర్పడిన దృష్ట్యా థియేటర్ ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేశారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని క్లీన్ యు సర్ట్ఫికెట్ పొందిన ఈ సినిమా గురించి నిర్మాత టి.రాజేందర్ మాట్లాడుతూ- ఐటి బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘సరసుడు’ అని, టి.ఆర్.కురళ అరసన్ సంగీతంలో వచ్చిన పాటలన్నీ హిట్ అయ్యాయని, విజువల్‌గా గ్రాండియర్‌గా వుంటాయని, సరికొత్త టెక్నాలజీతో యు.ఎస్‌లో పాటల రికార్డింగ్ జరిపామని తెలిపారు. యూత్‌తోపాటు ఫ్యామిలీ ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయని అన్నారు.