ఆటాపోటీ

కుంబ్లేపై పరోక్ష విమర్శలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పేరు ప్రఖ్యాతలున్న ఒక మాజీ క్రికెటర్ టీమిండియా కోచ్‌గా ఎంపికయ్యాడని, అతను ఒప్పందంలో తనకు నచ్చిన అంశాలను కాంట్రాక్టులో జొప్పించాడని గుహ ఆరోపణ. అందులో నిజం లేకపోలేదు. పరస్పర ప్రయోజనాలు ఉండరాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసినప్పటికీ, బోర్డుపై చాలా మంది మాజీ క్రికెటర్లు పట్టు బిగించి, అన్ని అంశాలను తమకు నచ్చినట్టు మార్చుకొని, రెండు చేతులా ఆర్జిస్తున్నారు. గంగూలీ లేదా ధోనీ, కుంబ్లే లేదా ద్రవిడ్, గవాస్కర్ లేదా కోహ్లీ.. అంతా క్రికెట్‌ను అడ్డం పెట్టుకొని అడ్డంగా సంపాదిస్తున్న వారే. సుప్రీం కోర్టు ఆదేశాలకు తూట్లు పొడుస్తూ, పరస్పర ప్రయోజనాలు పొందుతూ కోట్లకు కోట్లు వెనకేసుకుంటున్నవారే. డబ్బు సంపాదించడం తప్పుకాదు. అయితే, అభిమానుల్లో తమకున్న క్రేజ్‌ని అడ్డం పెట్టుకొని బిసిసిఐ సొమ్మును దోచేసుకోవడం తప్పని, ఈ సంస్కృతికి అడ్డుకట్ట వేయడానికి సిఒఎ ప్రయత్నించలేదని గుహ చేస్తున్న వాదనలో నిజం ఉంది.