విజయవాడ

మానవతా మణికిరీటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈరోజు మార్కెటింగ్ చెయ్యని
దినుసే లేదు
డబ్బుంటే ఆకాశం తోటలో
నక్షత్ర పుష్పాలనే కొనితెచ్చి
సిగలో తురుముకోవచ్చు
సముద్ర జలపుష్పాలు, మంచి ముత్యాలు
రాళ్లు, రత్నాలు సకల సంపదలు ధరవరలో
అమూల్య వ్యాపారమై రేటు పలుకుతోంది
చంద్రమండలంపై గ్రహరాశుల మీద
రేపు రియల్ ఎస్టేట్ బిజినెస్
మూడు పువ్వులు.. ఆరు కాయలుగా
వర్థిల్లనుంది
అక్కడక్కడా అపురూప ఇంద్రభవనాల్లా
బిల్డర్ల అపార్ట్‌మెంట్లూ, కాంట్రాక్టు బేరసారాలు
ఈ ధరణిపై గరికపోచ నుంచి
పంచభూతాల దాకా
ప్రతిదీ క్రయవిక్రయాల బీట్‌మార్కెట్
దళారీల దందా నడిరోడ్డుపై
జిందాబాద్ అంటోంది
మనుషులే కాదు సమస్తం సరుకుల అంగడి నేడు
నడివేసవిలో చల్లని గాలిని కూడా కొనాల్సిందే
సర్వం కాలుష్యమయమైన జమానాలో
ఊపిరితో, ప్రాణంతో ఉండాలంటే
స్వచ్ఛ ఆక్సిజన్‌నూ ఖరీదు చేయాల్సిందే
పంచదార లాంటి నీళ్లు
పాలునీళ్లు కూడా
దొరకవు గాక దొరకవు
అగ్గి కూడా వంటగ్యాసై ధర పలికే
వ్యాపార ప్రపంచమిది
అంతా కృత్రిమత్వం
సర్వం యాంత్రిక మాయాజాలం
సాంకేతిక సంపద ప్రయోజనాప్రయోజనాల
సెంటర్‌లో నిలబడి వుంది
రానున్న రోజులన్నీ ప్రపంచమంతా
పసిడి కలిగినోడి ముందు
భిక్షమెత్తుకోనున్నదా?
మానవతా మణికిరీటం
మట్టిపాలు కానున్నదా?
రక్షించే చేతులే లేవా?
- అంజనాశ్రీ,
ఖమ్మం.
చరవాణి : 7702537453

విద్యాదాతలు

రండి రండి గురువుల్లారా
ఉదయ కిరణాల్లా రండి
బతుకు బడులు తెరవండి
చీకటి తెరలు లేపండి
కళ్లజోళ్లు సరిచేసుకోండి
కాళ్లజోళ్లు కుట్టించుకోండి
ఈతిబాధలు దాచేసుకోండి
పున్నమి నవ్వులు పులుముకోండి
కొత్త కలాలు కొనుక్కోండి
పట్టుకొచ్చిన పిల్లకుంకల్ని
వరుసల్లో
కూర్చోబెట్టండి
నల్లబల్లలు తుడవండి
తెల్ల అక్షరాలు పూయించండి
చిట్టిబుర్రల్లో బంగారు కలల్లో
గట్టి ఆలోచనలు నిలపండి
బుజ్జగించి స్నేహం చేయండి
సముదాయించి ప్రేమికులవ్వండి
నవ్వించి స్వేచ్ఛగా చదివించండి
మంచిదారిన మరలించండి
విద్వద్దీపాలు వెలిగించండి
జ్ఞానాభ్యుదయ పథానికి
మెట్లదారి
మీరేనండి!
- షేక్ బషీరున్నీసా బేగం,
గుంటూరు.
చరవాణి : 9985193970

ఒంటిమిట్ట రామయ్యా..!

ఒంటిమిట్ట రామయ్యా.. నా హృదయంలో నీవయ్య!
నా మనస్సంతా నీదయ్య! నా కంటినిండా నీవయ్య!
నీ కాళ్లు కడుగ కదిలి వచ్చేనయ్యా! రామా..!
కల్యాణ రామయ్య! ఒంటిమిట్ట రామయ్య!
నా ఒళ్లు తెలియక! బడలిక చూడక! వయస్సు మీదపడ్డ!
ఆయసమనక! కల్యాణం చూడ వచ్చితిమయ్యా! రామయ్య!
ఈ రాతి గుండెను గుడిగా మలచవయ్య! ఓ ఒంటిమిట్ట రామా...
మన మధ్య గోదారే అడ్డయ్య! అయోధ్యరామయ్య
మన మనస్సుంతా పరమార్ధమయ్య! భద్రాద్రి రామయ్య!
అయోధ్య రామయ్య! ఒంటిమిట్ట రామయ్య!
కల్యాణ భోగం! భక్తజనానికి పరమానందం!
‘రామలక్ష్మణ జానకీ! జైబోలో హనుమాన్‌కీ!!
జైబోలో హనుమాన్‌కీ! రామలక్ష్మణ జానకీ!!
జమలాపురం ప్రసాదరావు, ఖమ్మం.