రాజమండ్రి

ప్రేమ పరిమళం (కథానిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాల్ ఆఫీస్ నుండి ఇంటికి బయలుదేరాడు. దారిలో పరిమళకి ఇష్టమైన పువ్వులు కొన్నాడు. స్వీట్స్ కూడా కొన్నాడు. దీనికి ముందే సినిమా టిక్కెట్లు కూడా ఆన్‌లైన్లో బుక్ చేశాడు. వీటన్నింటికి కారణం లేకపోలేదు. ఆఫీస్‌కు వెళ్లే ముందు పరిమళను తిట్టాడు. ఇద్దరి మధ్య జరిగిన చిన్న వాదన కాస్తా పెరిగి పెద్దదైయింది. అప్పుడు కోపంగా ఆఫీస్‌కు వచ్చేశాడు. ఆఫీస్‌లో మూడుసార్లు ఫోన్ చేసినా, వాట్సప్‌లో మెసేజ్‌లు పెట్టినా స్పందించలేదు. వాటి ఫలితమే ఇది.
అపార్ట్‌మెంట్‌కి చేరాడు. బండి పార్క్ చేసి ఇంటికి వెళ్లాడు ఆనందంగా. పరిమళ కనబడకపోయే సరికి పిలిచాడు. విశాల్‌లో ఆందోళన చెలరేగి ఇల్లంతా వెతికాడు. అయనా లాభం లేదు. సెల్‌కి ఫోన్ చేశాడు. సెల్ మంచం మీద ఉండటంతో ‘నా మీద అలిగి వెళ్లిపోయినట్లు ఉంది?’ అనుకుంటూ వెంటనే పరిమళ అమ్మగారింటికి బయలుదేరాడు. ఇరవై కిలోమీటర్ల దూరం అదేమి లెక్క చేయకుండా వెళ్లాడు!
‘రండి అల్లుడుగారు’ అంటూ ఆహ్వానించింది పరిమళ తల్లి.
‘ఏవండి! అల్లుడుగారు వచ్చారు’ అనగానే గబగబా వచ్చిన పరిమళ తండ్రి ‘బాగున్నారా’ అంటూ పలకరించాడు.
విశాల్‌కి అర్థమయ్యింది పరిమళ లేదనే విషయం.
ఇక్కడ ఒక ఫ్రెండ్‌ని కలవడానికి వచ్చాను. అని ఏదో చెప్పి బయలుదేరాడు!
విశాల్‌కి తలనొప్పి తారాస్థాయికి చేరింది. తన స్నేహితురాలు ఆకాంక్షని కలవడానికి వెళ్లిందా అనుకుంటూ మరో పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆమె ఇంటికి వెళ్లాడు. అక్కడికి వెళ్లేసరికి ఆకాంక్ష తన భర్తతో కలసి షాపింగ్ వెళ్లబోతుంది.
‘హాయ్ ఆకాంక్ష గారు.. పరిమళ మీ ఇంటికి వచ్చిందా?’
‘రాలేదండి! నిన్న ఫోన్ చేశా షాపింగ్ వస్తావా అని రాను అని చెప్పడంతో మా ఆయనతో కలిసి వెళుతున్నా!

పరిమళ ఎక్కడికి వెళ్లిందో మీకు చెప్పలేదా?’
‘చెప్పింది చెప్పింది’ అంటూ అక్కడ నుంచి వచ్చేసి పరిమళ తన చెల్లెలు అమృతమానస ఇంటికి వెళ్లిందేమో అనుకుంటూ మరో ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆమె ఇంటికి వెళ్లాడు.
‘బావగారు రండి! రండి! చాలా రోజుల తర్వాత,
అక్క రాలేదా?’
ఆ మాటకు ఉలిక్కిపడ్డాడు. అయితే పరిమళ ఇక్కడికీ రాలేదన మాట.
‘ఏమీ లేదు మానస ఫ్రెండ్‌ని కలవడానికి వచ్చి నిన్ను చూద్దామని వచ్చాను’ అని చెప్పి కాసేపటి తర్వాత అక్కడి నుండి అనేక దేవాలయాలలో పరిమళను వెతికాడు. ఎక్కడా కన్పించకపోయేసరికి నీరసంగా బాధతో ఇంటికి చేరాడు.
ఆశ్చర్యం! పరిమళ ఇంట్లోనే ఉంది!
విశాల్ కనబడగానే పరిమళ ‘సారీ అండి!’ అంది.
‘నేను నీకు సారీ చెప్పాలి బంగారం’
‘మీ ప్రేమ అర్థం చేసుకోలేకపోయాను. నేనంటే మీకు ఎంతిష్టమో నాకు ఇప్పుడు తెలిసింది. ఒక క్షణం నేను కనబడకపోతే అమ్మ ఇంటికి, ఫ్రెండింటికి, చెల్లింటికి వెళ్లారు నా కోసం’
‘నిజం పరిమళా.. నువ్వంటే నాకు చాలా ఇష్టం. అవును.. నువ్వు ఎక్కడికి వెళ్లావు?’
‘మీరు రావడం గమనించి, బట్టలు ఆరేయడానికి మేడ మీదకి వెళ్లాను. తిరిగొచ్చేసరికి మీరు కనబడలేదు. ఫోన్ చేద్దామంటే ఫోన్ మర్చిపోయారు మీరు.’
‘అవునా, ఫోన్ మర్చిపోయానా? నువ్వు కనబడలేదు అనే ఆలోచన తప్ప నాకింక ఏమి గుర్తులేదు!’
‘స్వీట్లు, పువ్వులు తెచ్చారు దేనికి?’
ఏమీ తెలియనట్లు, అంటూ నవ్వుకొని తర్వాత కలిసి సినిమాకి వెళ్లారు పరిమళమైన ప్రేమతో!!

- నల్లపాటి సురేంద్ర సెల్: 9490792553