దక్షిన తెలంగాణ

చిరునవ్వుల.. (కవిత)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతంలోని తిమిరాన్ని తలచుకుంటూ
విలపించకుండా..
రాబోయే వసంత గమనాన్ని
చిరునవ్వుతో స్వాగతించాలి..
బతుకు బాటలో పెను మలుపులకు
భయపడి ఆగిపోకు..అలసిపోకు..
వెనకడుగు వేయకుండా..

చక్కని పూల రహదారి అనే్వషించు..!
గులాబి కింద ముళ్లుకు భయపడక
గుభాళించే పరిమళాన్ని ఆస్వాదించు..!
కష్టాలు..నష్టాలు..బాధలు వేదనలు
ఎన్ని విధాలుగా నిన్ను సమీపించినా
చెదరని ఆత్మవిశ్వాసంతో నీ జీవితం
చిరునవ్వుల దివ్వెగా స్వీకరించు!!
- కోరుకంటి శశికిరణ్మయి, కరీంనగర్, సెల్.నం.9440287740

స్నేహం!

ఎంత మధురమైంది స్నేహం!
మాటల కందని భావం
దాన్ని కొలిచేందుకు..
లోకంలో లేదే పరికరం!
కుల మతాలకతీతం
జీవిత కాల వసంతం!
నిత్య చైతన్య సౌందర్యం!
అవధులు లేని ఆప్యాయత
షరతులు లేని సచ్ఛీలత దాని సొంతం!
ఆనందంలోనే కాదు..
ఆపదలోనూ అండగా వుండి
కంటికి రెప్పలా..
కాపాడుతుంది!
వయసు మడతల తీరు
అద్దంలోనే చూడగలం!
కానీ.. వ్యక్తిత్వపు పదనిసలు
స్నేహం నేత్రాల్లోనే వీక్షించగలం!
నిశీధిల్లో వెలుగు స్నేహం
లేదంటే..జీవితమే అంధకారబంధురం!
స్నేహం ఓ అందమైన ఆభరణం!
- డాక్టర్ బుర్ర మధుసూధన్ రెడ్డి, కరీంనగర్, సెల్.నం.9949700037