ఉత్తర తెలంగాణ

తెలంగాణ కథకుల కథాంతరంగం (పుస్తక సమీక్ష)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ కథా సాహిత్యాన్ని అమితంగా ఇష్టపడే గోపగాని రవీందర్ ‘తెలంగాణ కథకుల కథాంతరంగం పేరుతో ఓ గ్రంథాన్ని వెలువరించారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు సాహితీ వేదిక వారు ప్రచురించిన ఈ గ్రంథంలో..ఇరవై ఒక్క మంది కథకుల కథలను విశే్లషించారు. తెలంగాణ కథలను..ప్రస్తావిస్తూ..కథకులపై గోపగాని రవీందర్ ఆ వారం వారం ఆకాశవాణిలో ‘కథంతరంగం’ శీర్షికతో ప్రసారమైన ప్రసంగ వ్యాసాలను ఏర్చి, కూర్చి ఈ గ్రంథాన్ని రూపుదిద్దారు. ‘ఆధిపత్యంపై ధిక్కార స్వరం’ తెలంగాణ కథ యొక్క ప్రధాన లక్ష్యమని..ప్రపంచీకరణ నేపథ్యంలో పల్లెల్లో వచ్చిన మార్పులు.. ముఖ్యంగా ధ్వంసమైపోయిన కులవృత్తులను ఇతి వృత్తాలుగా ఎంచుకుని ఆయా కథకులు రాసిన కథలను, పల్లె ప్రజలు పట్టణాలు, నగరాలకు వలసపోతున్న వైనాన్ని..మసకబారుతున్న మానవ సంబంధాలను ప్రస్తావిస్తూ రాసిన కథలను ఈ గ్రంథంలో పొందుపరిచారు.
రామచంద్రవౌళి గారు రాసిన ‘పిడికెడు పక్షి విశాలాకాశం’ యొక్క పరమార్థాన్ని రవీందర్ చక్కగా విశే్లషించారు. తెలంగాణ తెలుగు కథకుల్లో రామాచంద్రవౌళి విలక్షణ కథకుడు అని కొనియాడారు. బి.ఎస్.రాములు గారి కథల్లో, జాతీయ, అంతర్జాతీయ పరంగా వస్తున్న సామాజిక ఉద్యమాల ప్రభావాన్ని చూస్తామని..ఆయన తన ‘వరుసలు’ కథ ద్వారా ఈ రోజు కోల్పోతున్న ఆత్మీయతల గురించి చక్కగా ఆవిష్కరించారని వివరించారు. గోపి భాగ్యలక్ష్మి గారి ‘జంగుబాయి’ కథ పాటు అనేక కథల్లో ఆమె ఆదివాసి స్ర్తిల జీవన దృశ్యాలను చిత్రించిన తీరును గుర్తు చేశారు. బెజ్జారపు రవీందర్ రాసిన ‘నిత్యగాయాలనది’ కథలో తెలంగాణ జీవన విధానాన్ని చక్కగా పొందుపరిచారని కితాబిచ్చారు. కాళోజీ నారాయణ రావు గారు రచించిన ‘మనమే నయం’ కథలో పేద బతుకుల్లో మార్పు రాని వైనాన్ని నొక్కి చెప్పిన విధానాన్ని రవీందర్ విశే్లషించిన తీరు బాగుంది. పి.వి.నరసింహారావు గారు రాసిన ‘గొల్ల రామవ్వ’ కథతో ఆ రోజుల్లో ప్రజలు ఉద్యమాలకు సహకరించిన తీరు తెన్నులను చూడగలమని రవీందర్ వివరించారు. తెలంగాణ మాండలికంలో సాగే ఈ కథలో నాటి తెలంగాణ తెలుగును చూడగలమని అభిప్రాయపడ్డారు.
అల్లం రాజయ్య కలం నుండి జాలువారిన ‘సృష్టికర్తలు’, కథను సమీక్షిస్తూ.. సృష్టికర్త దేవుడు కాదు.. నేలపైన మనుషులకు తిండిపెడ్తున్న రైతులేనని తేల్చి చెప్పారని గుర్తుచేశారు. ఇలా..వీటితో పాటు వట్టికోట అళ్వారు స్వామి గారి ‘చిన్నప్పుడే’ పొట్లపల్లి రామారావు గారి ‘మా ఊరికి ఆహ్వానం’ పెద్దింటి అశోక్ కుమార్ గారి ‘తెగిన బంధాలు’, తుమ్మేటి రఘోత్తమ రెడ్డిగారి ‘ఇల్లు’, పి.యశోదారెడ్డి గారి ‘సీతక్క పెండ్లి’ బోయ జంగయ్య గారి ‘బొమ్మలు’, దాశరథి రంగాచార్య గారి ‘తామర పువ్వులు’, బి.మురళీధర్ గారి ‘బొమ్మల పెట్టె’, ముదిగంటి సుజాతా రెడ్డి గారి ‘గుడిసెలు గుడిసెలు’, స్కైబాబా గారి ‘జీవం’ కాలువ మల్లయ్య గారి ‘ఊరుమ్మడి బతుకు’, అంపశయ్య నవీన్ గారి ‘చెర’ జింబో గారి ‘సర్వేజనా సుఖినోభవంతు’, ఇలా ఇరవై కథలపై రవీందర్ గారు చక్కని విశే్లషణ చేశారు. తెలంగాణ ప్రజల ఉద్యమాలతో ప్రభావితమైన కథకులు.. వారి కథల్లో ప్రజల జీవితాలను విభిన్న కోణాల్లో ఆవిష్కరించిన సంగతులను ఈ గ్రంథం ద్వారా లేఖా మాత్రంగా ప్రస్తావించిన రవీందర్ గారిని అభినందిద్దాం..ఈ వ్యాసాలన్నీ సమీక్షల రూపంలో పైకి కనిపించినా..రవీందర్ గారి లోతైన విశే్లషణతో పరిశోధనా వ్యాసాలుగా భావించవచ్చు..తెలంగాణపై, తెలంగాణ రచయితలపై రవీందర్ గారికున్న గౌరవాన్ని చూడగలం.

పేజీలు: 95 వెల : 100/-
ప్రతులకు:
గోపగాని రమణశ్రీ
ఇం.నం.9-76/2
ఫకీర్ గుట్ట - ఉట్నూర్
జిల్లా: ఆదిలాబాద్-504203
సెల్.నం.9440979882

- సాన్వి, సెల్.నం.9440525544