ఉత్తర తెలంగాణ

హెచ్చరిక! (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్ద్ఫాసర్ రంగరాజము వసంత మెడలో మూడు ముళ్లేసి పదమూడు వసంతాలు గడిచినా సంతాన సౌభాగ్యం కలుగలేదు. వేల రూపాయలు లాగి పదుల్లో పరీక్షలు చేసిన డాక్టర్లు వసంతకు తల్లి అయే అదృష్టం లేదని తేల్చి చెప్పేశారు. మానసికాందోళనలో మునిగి తేలుతున్న వసంత ‘మీరు మరో పెళ్లి చేసుకోండి’ కరణేశు మంత్రిలా సలహా యిచ్చింది. రంగరాజము మాత్రం గిలిగింతలు వడ్డించి ‘నీకు సవతి పోరు పెట్టలేను’ అనేశాడు. ‘అయితే అనాధాశ్రమం నుండి ఓ పాపనో, బాబునో తెచ్చుకుందామండీ!’ అని వంటింట్లోకెళ్లింది.
సోఫాలో కూచున్న రంగరాజము మనసు తెరమీద గతం గంతులేయసాగింది.
తాను పిజి ఫైనల్లో ప్రవేశించాడు. పక్కింట్లో రామారావు కుటుంబం ప్రవేశించింది. రామారావు కూతురు రజని రంభలా కన్పించింది. ఆమె పరిచయం పెంచుకుంది. పరిచయం ప్రణయంగా మారి సినిమాలు, షికార్లలో హద్దులు రద్దు చేసింది. పిజి ఫైనల్ పరీక్షలకు ముందు రజని కౌగిట్లో బందీయై ‘నాకిపుడు మూడోనెల, గర్భవతిని’ చెప్తుంటే కళ్లు మంచుపూలైనాయి. తన అయోమయంలో విచిత్రమైన అనుభూతి. ‘నా పరీక్షలవగానే పెళ్లి చేసుకుందా’మని బుగ్గలు నిమిరాడు.
రజని వాళ్లమ్మా నాన్నలకు చెప్పిందేమో వాళ్లు తనను పిలిపించుకుని నిలదీశారు. ‘మా మేనల్లుడికిచ్చి పెళ్లి చెయ్యాలనుకున్నాం కానీ ఇలా చేశావేంటీ?’ అంటూ గట్టిగా నిలదీశారు. ‘తప్పకుండా మా అమ్మానాన్నలను ఒప్పించి పెళ్లి చేసుకుంటా’నన్నాడు. అయితే రజనికిపుడు అబార్షన్ చేయిస్తా. పరీక్షలయ్యాకనే పెళ్లి చేసుకో. రామారావు గొంతు వణికింది. తన గుండెకు గుండుసూది గుచ్చుకున్నట్టయింది. అబార్షన్ వద్దన్నాడు.
ఫైనల్ పరీక్షలైన మర్నాడే రెండేళ్ల క్రితం జరిగిన ఉద్యోగం ఇంటర్వ్యూలో ఎంపికైనట్టు వెంటనే ట్రెయినింగ్‌లో చేరాలని ఆదేశమొచ్చింది. అంతకు ముందు రోజే రజనీవాళ్లు ఇంటికి తాళమేసి ఊరికెళ్లారు. తన ట్రైనింగ్ సంగతి వాళ్లకు చెప్పలేక పోయాడు.
ట్రైనింగ్‌లో లెక్చర్స్, సెమినార్లు, గ్రూపు డిస్కషన్స్, ప్రాజెక్టు పనులు.. ఉత్తరాలు రాసేందుగ్గూడా టైం లేదు. రజని ఇంట్లో ఫోన్ లేదు. ఓ రెండు సార్లు నాన్నతో మాట్లాడ్డమే గగనమైంది. ట్రైనింగ్ చివర్లో పోస్టింగిచ్చి అర్జంటుగా వెళ్లి ఉద్యోగంలో చేరాలన్నారు. ఆదేశాన్ననుసరించక తప్పలేదు! అప్పటికే రజనీకి కాన్పు కావచ్చు. మరో యువనిక మీద రజని పాపతో ప్రత్యక్షమైంది. వెళ్లి ఆమెను గుళ్లో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. సెలవు మంజూరు చేయించుకుని రెక్కలు కట్టుకుని వచ్చి ఇంట్లో వాలాడు. రజనీ గురించి అమ్మనడిగాడు.
‘పాపం! ఆ పిల్లనెవడో ప్రేమించి మోసగించాడట్రా. పెళ్లికాకముందే గర్భవతైందని తెలిసి గూడా వాళ్ల మేనబావ పెళ్లి చేసుకున్నాడు. రజనికిపుడో బాబు పుట్టాడట’ అమ్మ సానుభూతి. ‘వాళ్ల మేనబావ దేవుడనుకోవాలిరా. ఆమెను మోసం చేసినోడు శిక్షననుభవిస్తాడురా’ సుడిగాలిలో చుట్టుకు పోయినట్టైంది తనకు.
అమ్మా నాన్నలు మెచ్చిన వసంత అర్ధాంగిగా వచ్చింది. తనవల్ల రజనికి జరిగిన అన్యాయం అగ్నిపర్వతమై పేలి గుండెల్లో నిక్షిప్తమైంది. ఓసారి వసంతను పుట్టింటికి పంపించి తాను ఇంటికొచ్చాడు. పెరటి ప్రహరీ గోడ మీంచి అటువైపు రజని కన్పించింది. సైగ చేయగానే గోడ దగ్గరికొచ్చి దులిపి పారేసి ‘నువ్వో మోసగాడివంది. వాడిలో తన పోలికలున్నాయి. రజని హేళనగా నవ్వి ‘వీడు మన ప్రేమకు ప్రతిరూపం. ఓ మృగాడికి బలైపోయానని ఆత్మహత్య చేసుకోబోతుంటే మా బావ వారించి పెద్ద మనసుతో పెళ్లి చేసుకున్నాడు’ అని చెప్పింది. ఆ తరువాత ఆమెకు మరో కొడుకు పుట్టాడని తెలిసింది. ఆమె తమ్ముడోసారి కలిసి ఆమె బెంగుళూరులో ఉంటుందని చెప్పాడు. అడగ్గానే బెంగుళూరు అడ్రసిచ్చిండు..
వసంత వచ్చి పక్కన కూచుండి భుజాలు కదిపింది. ఈ లోకంలో కొచ్చి రజని విషయమంతా చెప్పాడు. చివరికి నా రక్తం పంచుకుపుట్టిన బాబు నాక్కాకుండా పోయిండు అంటూ బాధపడ్డాడు. వసంత మొహం ఇంద్రధనుస్సులాగైంది. మీరు వెంటనే బెంగుళూరు వెళ్లి ఆ బాబును తీసుకురండి. మనకు సంతానముందని మురిసిపోదాం అంది. ఎలాగైనా రజనిని ఒప్పించి బాబును తెచ్చుకోవాలనుకున్నాడు.
మర్నాడే ఫ్లైటులో బెంగుళూరుకెళ్లాడు. అది గార్డెన్ సిటీ. ప్రకృతి అందాలలో పరవశిస్తూ రజని ఇంటిముందు ఆటో దిగాడు. పిల్లలు బయట ఆడుకుంటున్నారు. తాను లోపలికెళ్లాడు. రజని కనిపించి ‘నువ్వా? ఎందుకొచ్చినవ్?’ అడిగింది. సోఫాలో కూర్చుని ‘రజనీ! దయచేసి నీ భర్తను పిలు’ అన్నాడు.
రజని మొహంలో రంగులు మారాయి. ‘మా బావ దేవుడు. పెద్ద ఉద్యోగాన్ని, నన్ను వదిలేసి దేవుని దగ్గరికెళ్లిండు. అంటూ గోడమీదున్న తన బావ ఫోటో, దానికేసున్న దండను చూపించింది. ఇపుడు మా బావ ఉద్యోగాన్ని నాకిచ్చారు. గర్వంగా చెప్పింది. తన రూటు క్లియరైందనుకుని, తన సంగతంతా చెప్పి, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నా భార్య వసంత నిన్ను అక్కగా, పిల్లల్ని తన పిల్లలుగా చూసుకుంటుంది. సముదాయించాడు.
రజని మోహంలో అసహ్యం పేరుకుపోయింది. ‘షటప్ నేను ఇల్లూ ముంగిలి, జీవనాధారం లేని బికారిని కాదు. ఇది నా సొంతిల్లు. మా బావకు దేవాలయం. నువ్వు వచ్చిన దారిన వెళ్లిపో’ అంటూ గద్దించింది.
‘అది కాదు రజనీ!’ మళ్లీ సముదాయించబోయాడు. రజని ఆడసింహంలా చూసింది. ‘యూ గెటౌట్. పిల్లలు కలగలేదనే సాకుతో వసంతకు అన్యాయం చేశావో.. జాగ్రత్త!’ హెచ్చరించి పంపించింది.

- ఐతా చంద్రయ్య సిద్దిపేట, సెల్.నం.9391205299