కృష్ణ

ఒమర్ అరెస్టుతో ఉలిక్కిపడ్డ కొత్తమాజేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చల్లపల్లి, జూన్ 24: ఉగ్రవాద సంస్థ ఐసిస్ సానుభూతిపరుడైన ఒమర్ అలియాస్ కొనకళ్ల సుబ్రహ్మణ్యం అరెస్టుతో అతని స్వగ్రామమైన చల్లపల్లి మండలం కొత్తమాజేరు గ్రామస్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మతం మార్చుకుని విధ్వంసకర చర్యలకు కుట్ర పన్నిన సుబ్రహ్మణ్యంను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేయటం తీవ్ర కలకలం సృష్టించింది. కొనకళ్ల వెంకటేశ్వర్లు, అమ్మగారు దంపతులకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రెండవ కుమారుడైన వెంకట నరసింహరావు 20 యేళ్ల క్రితం అత్తగారి గ్రామమైన బందరు మండలం చిన్నాపురం గ్రామానికి వలస వెళ్లాడు. సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులను అవనిగడ్డ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కొత్తమాజేరు గ్రామంలోని సుబ్రహ్మణ్యం బంధుమిత్రుల ఇళ్లకు పోలీసులు వచ్చి వెళ్లడం కనిపించింది. గ్రామంలో సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు ఉన్న ఆస్తిపాస్తుల వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు. నరసింహరావుకు పిత్రాతార్జితం ద్వారా వచ్చిన భూములు, ఆ తర్వాత స్వతహాగా కొనుగోలు చేసిన భూముల వివరాలు సేకరించి ఏ విధంగా కొనుగోలు చేశారనే అంశంపై కూడా విచారిస్తున్నారు.