సాహితి

విశ్వనాథ వారి కావ్య రసోన్మీలనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాముని కాత్మలో నొక విరాగము కల్గిన మాట, యాని రా
గామిత తీవ్రతల్ జెడి తనంత తన శాంతి వహించు పిమ్మటన్
దా ముది ఱేనికిన్ దశరథ క్షితిజాని కెఱుంగ నయ్యో బో
బ్రామిన భీతియున్ దరతరై మనజేశుండు దండడించుచున్
బ్రహ్మచారి సుతుండు విరాజియైన
జనకుడూహించు సుతు గృహస్థునిబొనర్ప
నా గృహస్థుండె సుతుడు విరాగియైన
దండ్రి వ్యవహారమతనికి దాల్పజేయు’’
ఇది రామచంద్రునికి పట్టము కట్టుటకేర్పడిన సందర్భము. రామునకేల విరాగము? అతడు బ్రహ్మచారి కాడు. నూతన గృహస్థుడు. అతనికి వైరాగ్యమేర్పడుటలో కారణము కనిపించదు. అయిననూ ఏదో వైరాగ్యము. ఇటువంటి పరిస్థితిలో రామునకు తప్పనిసరిగా చేయవలసిన పట్ట్భాషేకము. ఇది పరమానందమా? ఒక్క దశరథునకు తప్ప మిగిలిన ప్రపంచమునకు ఆనందహేతువే. మరి దశరథుకేల కాదు. ఇచట దశరథునిది జీవుని వేదన! ఎందులకు? సకలోహ వైభవ సనాధము శ్రీరామ భాషణము. అట్టిది రాముడేలనో వైరాగ్యమును ప్రకటించుచున్నాడు. వస్తు గతిని బట్టి జీవుని వేదన వల్ల నూహ ఉద్దీప్తమవును గనుక దశరథునకు శ్రీరామ పట్ట్భాషేకము ఆవశ్యకమైనది. కవికి (దశరథునికి కూడా) ఇట్టి గ్రథనమందు విశ్రాంతియుండదు. కథలయందు గుణాలంకారములు సంయోజించుటలో విరామముండదు. జీవుని వేదనయందే విరతి. ఎంత ఆతృతపడినాడు. ఈ సందర్భము నాశ్రయించి గుణాలంకార భావనముతో ఈ జీవుని వేదన అనుభూయమానమైనది గాన ఈ కథ, గుణాలంకారములు. ఈ దృశమైన వేదనానుభూతిని వ్యక్తము చేయుచున్నది. కనుక ఆ అనుభూతి ప్రభావము వీనికి సంక్రమించినది. జీవుని వేదన అగ్నివంటిది. కనుకనే దశరథుడు తన ముదిమిని విప్పినాడు. ఇది ఇంతదనుక యొక మూట యన్నమాట. కొడుకు బ్రహ్మచారి యైనచో వివాహము చేయును. కొడుకు గృహస్థుడై ఈ యొక వైరాగ్యమును చూపిన బాధ్యతలప్పగించును. రాజు కొడుకునకు బాధ్యత యెట్టిది? రాజ్యపాలనము. వ్యవహారముల నప్పగించుటయన్న ఈ లౌకికాంశ లోకమున తండ్రికిది యనుభవ సిద్ధమైన విషయమే. ఇచట కనిపించు ఈ తీరున చమత్కారము గలదు. పరమేశ్వరుడైన శ్రీరామునకు వైరాగ్యము సహజము. మానవుడైనను అప్పుడప్పుడు పరంపరాగతమైన విశేషములు బయల్పడుటయే పాత్ర వ్యక్తీకరణము. ఉచితమున్ను. రాముడీ పట్టమున కంగీకరించునా? ఏమో! ఈ మహోత్సవము ను రాజు అకస్మాత్తుగా నిర్ణయించును. ఎవరినీ ఆహ్వానించడు. కడకు కైక తండ్రిని కూడా. అసలు భరత శతృఘు్నలింటికడ లేనే లేరు. ఎల్లరకు ఆమోదయోగ్యమైన ఈ నిర్ణయము పట్ల రాజునకేలనో భయము- తత్తరపాటు. తను పెద్దవాడయ్యాడు. తన తదనంతరం రాజు కావలసినవాడు వైరాగ్యం ప్రకటిస్తున్నాడు. ఇది దశరథునికి తీవ్ర మనస్తాప విషయమైంది. పరిషన్మండలితో తన వార్థక్య విషయాన్ని ప్రస్తావించటంలో విశ్వనాథవారు పద్య శిల్పంగా ప్రదర్శించిన విన్నాణమద్వితీయము.
‘‘ఈనకున్ గుండల హేమనూతన హరిద్రాకాంతి కర్ణాత కేశ
నిపీ ఈ గ్రవ మజ్జరాసిత విశేషాక్రాంతి డోల్పోయెడున్- తనకున్
షష్టి సహస్ర వర్ష ధరణీ శాత్సర్య చింతా చిరంతన రేఖ.....బత
యాళుతాలు చరితత్వక్పర్యయంచే చెడున్’’ ఉగ్రవ నుజ్జరా
అనే సమాసరచన దశరథ వార్థక్య సాంద్రతను వ్యక్తీకరిస్తుంది. వయోదశానుసరణమైన జీవునివేదన యిదే. అగ్నివంటిది.
అసలీ రామాయణమునకు జీవభూతమైన అంశము కైక. విశ్వనాథ దృష్టిలో కైక- 1. కేకయ రాజకన్య, హేలాగతి డాగురేకుల తళత్తళ, 2. కైకేయి మధుసామగానమూర్తి, 3. కైకేయి నును నల్ల కల్వపూవు. కైక దశరథ మహారాజునకు డాగురేకుల తళత్తళ కాటుకయైనది. ఇది స్థూలార్థ వివరణము. తరువాత నొక సీసమందు.
‘‘కౌసల్య ముక్తి కాంతా సమానాకార
నలి సుమిత్ర యుపాసనా స్వరూప
విజయ సమాకార వినయాంబుధి సుమిత్ర
కైకేయి మధుసామగానమూర్తి
కౌసల్య నవ శరత్కాల మందాకిని
సిత పుండరీకము శ్రీసుమిత్ర
మందార పుష్పంబు మహిళా మణి సుమిత్ర
కైకేయి నను నల్ల కల్వపూవు
ధర్మకామంబు లీరెంటి దశరథుడు
ముగురు భార్యలందును రసమూర్తులంచు
అమృత సౌఖ్యానుభూతి నధ్యయన సుఖము
తీర్థ భోగ సుఖమ్ము సిద్ధింపగనియె’’
ఇందు మొదటి నాలుగు పాదములు (2 పెద్దది + 2 చిన్నది)లో కౌసల్య యొకసారి- సుమిత్ర రెండుసారులు. కైక ఒకసారి వర్ణింపబడిరి. తిరిగి రెండవ నాలుగు పాదములలో ఒకసారి కౌసల్య రెండు మారులు సుమిత్ర ఒకసారి కైక తిరిగి వర్ణింపబడిరి. కౌసల్య ముక్తికాంతా సమాన ట సమిత్ర ఉపాసనా స్వరూప; విజయ సమాకారయేకాక వినియాంబుధి. కైక సామగాన మూర్తి. ఈ పద్యంలో దశరథుని రాణులు మువ్వురి బాహ్యా ంతర రూపములు స్పష్టమే. ముక్తికాంతను చేరుకొనుటకు సాధన రూపమగు ఉపాసనా క్రియ సుమిత్ర. కౌసల్యా సు ప్రజా రాముడు ముక్తి మార్గ ప్రదాత కాగా అమ్మ సామాన్య గాదు. అప్పట్టున కౌసల్య ఎల్లప్పుడు మాన్యురాలు; ఏ తత్ విధి కౌసల్య ముక్తికాంతా సమాకార. సుమిత్ర ఉపాసనా స్వరూపయ ని కదా విశ్వనాథవాణి. సౌమిత్రి తజ్జనని కుమారుడగుట ఉపాసనా స్వరూపుడే. అతని యుపాసనయంతయు శ్రీరామచంద్రమే.
ఇదియే కవి శిల్పధ్వని. ఆగామి పుత్రోదయమునందలి భావాభివ్యంజనమిదియే. ఆ గుణ గణములీ పద్యమునందు నిక్షేపింపబడినవి. కౌసల్య శరత్కాల మందాకిని. ఆ సురనదీ సుషమాంతరంగ భాగ్య గరిమ సిత పుండరీకము సుమిత్ర. మందారమునై భాసిల్లు నదీ కవల తల్లి. కైక నును నల్ల కల్వ పూవు. మువ్వురు రాణుల బాహ్య స్వరూప వర్ణన అయినది. వీరితో దశరథుడు ధర్మ కామమును యథావిధిగా నిర్వర్తించెను. అది అమృత సౌఖ్యము. అనుభూతి అధ్యయన సౌఖ్యము. తీర్థ్భోగ సౌఖ్య ము. శిరోమావి శిరోధార్యమైన గంగవోలె పవిత్రమై పట్టమహిషిగా కౌసల్య భాసించగా- ఆ సారస వాహినీ హృదయ సంసర్గ ధ్వని యోగ్యత గల మూర్తి సుమిత్ర. సుమిత్ర ఒక విజయ పుండరీకము (లక్ష్మణుడు) వెంటనే యొక వినయ మందారము (శత్రుఘు్నడు) గదా. మరి కైకయో!! ఒక పరి మధుసామగానమూర్తి. మరియొక పరి నును నల్ల కల్వపూవు. ఇంతకుమించి మునే్న ఆమె ‘డాగు రేకుల తళత్తళ’.
‘‘తనునగు శబ్దార్థంబులు/్ధ్వని జీవ మలంక్రియా వితానము సొమ్ముల్/తనరు గుణంబులు గుణములు/ఘన వృత్తులు వృత్తులౌర కావ్యేందిరకున్’’ (కావ్యాలంకార సంగ్రహం)
శబ్ద, అర్ధ, ధ్వని, అలంకార, గుణ, వృత్తులే గాక రీతి, పాక, శమ్యాదులున్నవి. అవియన్నియు కావ్యాంగములే.
విశ్వనాథవారి కల్పవృక్షమున కథా కథన రీతియే వేరు. మంథర మాటలు (దుర్బోధలు) విననంతవరకు కైక
‘‘... కేకయాధిపుసుతరా- అమ్మా యని తోర్తోడ తతవ్మౌ భయమందె దద్వ్రతస్థలనమతిన్’’
‘‘చెలువుగ వరాజ్యవభిషేక మిదేమిటి- ఱేపు ప్రొద్దునన్
వెలువడి నీవు సద్వ్రతము నీటను బుచ్చి యిదేమి రాక..?’’
అంటూ మెత్తగా కోప్పడుతుంది. ఆ తరువాత సన్నివేశములోనిది కైక హృదయానురక్తిలోని మార్పు. ఆమె మనసులో ఏర్పడ్డ భయం తన రామునికి తాను ఒక ప్రయోజనార్థం నేర్పిన ధనుర్విద్యయంతయూ వృథాయగునన్న భయము. ఆ భయమంతయు మంథర వలన రాముడు నిర్వర్తించవలసిన ఒక మహాకార్యమును గుర్తుకు తెచ్చుకొనుటలో, రాముడడవికి వెళ్ళవలసి రావటం అందుకే ఆమె శ్రీరామచంద్రునకు పట్టము గట్టినచో తాను విషము మ్రింగి చనిపోదునని యన్నది. ఒక్క రోజు గూడ కౌసల్యను రాజమాతగా చూడలేనని యన్నది. ఈ విశ్వనాథ వారి కథనమే వేరు. కైక వరమును కోరినది. దశరథుని పచ్చని వృక్షముపై పిడుగు పడినది. దశరథుడు కైక యొక్క క్రౌర్యమును పరిపరి విధముల వర్ణించెను. తన మాటలకు సరియగు సమాధానము ఆమె నుండి యాశించెను. కానీ కైక ఏమియు మాటాడదు. ఒక్క మాటయు ఆమె నోటి నుండి రాదు. వాల్మీకంలో కైక దశరథుని ‘దుర్మతీ’యని కూడా యన్నది. కానీ విశ్వనాథవారి కైక
‘‘పతి వచోభిముఖీనవౌ పడతి యాత్మ
నిముస నిముసంబునకు నేదొ నిలువరించె
క్ష్మాతవేంద్రుడు దుఃఖా వాచాలుడైన
తరుణి కైకేయి దుఃఖ నిస్తబ్దయయ్యె’’
హృదయము బరువెక్కి మాట వెలికిరాని విషాదమును వ్యక్తపరుచుటకు ఏ మాట సరిపోవును? ఎట్టి మాటయు చాలదు కనుకనే ‘నిస్తబ్ద’మగుట ఇది రాముని వనముల కంపవలసి వచ్చినందుకు హృదయ శోచనాభారమెంతటిదో తెలియజేయును. దశరథుని ప్రశ్నలకు కైక సమాధానము చెప్ప వీలు లేదు. ఏది చెప్పినను రాముని వనవాసనమునకంపుటకు దశరథుడు అంగీకరింపడని కైకకు తెలుసును. తన పతి ‘దుఃఖవాచాలుడు’ కాగా తాను (కైక) దుఃఖస్తబ్దయైనది. విచిత్ర సన్నివేశము. రాజు దుఃఖమును చూచియు కైకకు దుఃఖము కలుగవచ్చును. కాని అది అట్టిదైనచో వ్యక్తమగును. వ్యక్తమైనచో ఆమె విశ్వనాథ వారి కైక కానేరదు. ఇప్పుడిచట కైక స్థితి యట్టిదే. వౌనముతోనే గాఢతరమైన, అగాథములైన తన మనోభావములను వెలిబుచ్చినదో - దాచినదో- ఆమెకే తెలియును. ఇది విశ్వనాథ వారి శైలీ శిల్పము. కవి యొక్క శిల్ప నైపుణ్యముచే ఒక్కొక్క పాత్ర నిర్మాణ వైఖరి కథాకథన వేగమునుండి పాఠక హృదయమును నిలువరించి ఆ పాత్రకు పాఠకుల (సహృదయ పాఠకులు) హృదయమున చిరప్రతిష్ఠను కలిగించి రసాస్వాదనమునకు తోడ్పడును. విశ్వనాథ సృష్టించిన ఈ కైక యొక్క సంభాషణము ఆమె యొక్క ప్రాగ్బల్యమును చాటును. కర్తవ్యమును చెప్పును. మూలమున లేని యొక గొప్పతనము- తీవ్రాభినివేశము- పైకి తోచని సముద్రమంత వాత్సల్యము- ఇవియన్నియు ఆమెలో కథా కథన విధముననుసరించియే సాగును. రామాయణము కరుణరస ప్రధానము. ఆ రస సృష్టియందు క్షణమైనను ఏమరుపాటులేని విశ్వనాథ అన్నట్లు
‘‘కవి ప్రతిభలోన నుండును
కావ్యగత శతాంశముల యందు తొంబదియైన పాళ్లు
ప్రాగ్విపశ్చిన్మతంబున రసము
వేయి రెట్లు గొప్పది నవకథా ధృతిని మించి’’
అన్నది శ్రీమద్రామాయణ కల్పవృక్షం అవతారికలోని ఓ పద్యం. రసము వేయి రెట్లు గొప్పది అనుటలో ఆంతర్యము బహుధా గొప్పదని చెప్పుటయే. కావ్యగతమన నవ కథా సంవిధానము కన్ననూ దాని ఆత్మ గొప్పది. ఆత్మరసమే. మరి రసమెట్టిది? ‘‘విభావానుభావ వ్యభిచారీ సంయోగాత్ రసనిష్పత్తిః’’ ఇది భరతముని నిర్వచనము. ఆస్వాద్యత్వమే రసపదార్థం. నానా వ్యంజన సంస్కృతమైన అన్నమును భుజించుచూ రసమునాస్వాదించుచు- సుమనస్కులైన వారు హర్షాదులేవిధముగా ననుభవింతురో ఆ ప్రకారమే నానా భావాభి వ్యంజితములు, వాగంగ సత్త్వోపేతములైన స్థారుూ భావముల ననుభవింపజేయగల పరమోత్కృష్ట స్థితి కల్పించును. ‘లోకమ్ము వీడి రసమ్ములేదని’ రచనలు చేసిన నట్టి ఏకైక కవి విశ్వనాథ దృష్టిలో..
ఒక గండభేరుండ మొక మత్తవేదండ
మొక యున్నత మహీద్ర మొక సముద్ర
మొక వేద మొక శాస్తమ్రొక మహాకావ్యమ్ము
ఒక పురాణమ్మొక యుపనిషత్తు
ఒక ఝంఝ యొక వృష్టి ఒక ఝరి యొక ప్రౌఢ
నాయికాయత పురుషాయితమ్ము
ఒక పండితోద్దండుడొక యొజ్జ యొక యోద్ధ
ఒక మహాసమ్రాట్టు యొక మహర్షి

స్మృతిదగిలి బాయకుండు దదతి విశిష్ట
కావ్య హేతుత్రరుూ వ్యక్తి భవ్యతలను
వరుస నొక్కక దాని భావనము సేయ
నాకు నచ్చిన కవి విశ్వనాథుడొకడు.

- సాంధ్యశ్రీ, 8106897404