డైలీ సీరియల్

ట్విన్ టవర్స్ - 37

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాని, ఆశ్చర్యం- వౌళిని గురించి పట్టించుకోకపోవడం. అదే నాకు అర్థంకాని విషయం. ఇక్కడ అమ్మ, నాన్న, మామ్మ, అన్నయ్య, అంత వాడిని ఇంతగా అపురూపంగా చూడటం అక్కడ వాళ్ళు అసలు వాడితో ఎటువంటి సంబంధం పెట్టుకోకపోవడం నా మనసుకు అర్థంకాని విషయం.
బహుశా కొడుకు దూరంగా ఉన్నప్పుడు తమకు మాత్రం ఎందుకనున్నారేమో? లేదా కొడుకు దగ్గరయినప్పుడే తాము దగ్గరయినప్పుడే తాము దగ్గరవ్వవచ్చు అనుకున్నారేమో!
ఇది మాత్రం ఈనాటికీ నాకు సమాధానం దొరకని ప్రశ్నయే!
మామ్మకు మాత్రం చాలా రెస్ట్‌లెస్‌గా ఉండేది. రోజులు మామూలుగా గడుస్తున్నాయి. వౌళి స్కూల్‌కి వెడుతున్నాడు. నాన్న రిటైర్ అయ్యారు.
రాజకుమారుడు పబ్లిక్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతున్నాడు.
అమెరికాకి ఇటు నుంచి ఉత్తరాలు వెడుతూనే ఉన్నాయి, సమాధానాలు రాకపోయినా. నాన్న కూడా బాగా ఫోన్స్, ఉత్తరాలు తగ్గించేశారు రఘు తల్లిదండ్రులతో. వారి వైపు నుంచి ఎప్పుడూలాగానే ఎటువంటి స్పందన లేదు.
స్తబ్దత ఆవరించిన నా జీవితంలో ఒక చిన్న మెరుపు- నాకు ఉద్యోగం రావడమే! గర్ల్స్ కాలేజీలో జూనియర్ లెక్చరర్‌గా.
చిత్రం ఏమిటంటే అందరికి మనసులో కలిగిన సంతోషం వెనుక ఒక తోకలా మరో భావం వెంటాడమే! అదొక విచిత్రమయిన సందర్భం. ‘అహ’ అన్న సంతోషంలో ‘అయ్యో’ అన్న నిరుత్సాహం వెంటాడింది. ఈ ఉద్యోగమే నాకు మరో విధంగా వచ్చి ఉంటే, మరో దేశంలో వచ్చి ఉంటే అందరూ అందలం ఎక్కినంత ఆనందపడేవారేమో!
అలాటి భావనకు లోనవనిది నేనొక్కదానినే!
నాకు ఇప్పుడు అమెరికా ఇంకా వెళ్లలేదే అన్న నిరుత్సాహం లేదు.
రఘురాం బొత్తిగా ఉత్తర ప్రత్యుత్తరాలు చెయ్యడం లేదన్న బాధ లేదు.
నా భవిష్యత్తు ఎలా ఉంటుందా అన్న భయం లేదు.
ఈ మూడూ నా కుటుంబాన్ని ముళ్ళలా పొడుస్తున్నాయి. నాకు కలిగిన భావన అల్లా ఒక్కటే! పెద్ద రిలీఫ్- ఆర్థిక స్వాతంత్య్రం. అంతకుమించి ప్రస్తుతం ఏమీ కోరుకోవడంలేదు. మొదటిసారిగా జీతం అందుకున్న రోజు కాలేజీ నుంచి సరాసరి గుడికి వెళ్లాను. ఆ రాత్రి అన్నయ్య దగ్గరకు వెళ్లాను.
ఎలా మొదలుపెట్టాలో, ఏం మాట్లాడాలో కూడా తెలియలేదు. ఏం మాట్లాడినా అది అన్నయ్యని మాత్రం బాధపెట్టకూడదు.
ముందు అమ్మతోనే మాట్లాడదామనిపించింది. అమ్మకు ఏం చెప్పినా అది మామ్మకు కూడా తెలిసిపోతుంది. అందరూ కలిసి అదో పెద్ద విషయంగా చేసేస్తారు.
‘‘ఏమిటి అంత సందేహిస్తున్నావు?’’ అని అడిగాడు అన్నయ్య.
కాలేజీనుంచి వచ్చిన చెక్ చూపించాను.
‘‘సంతోషం’ అన్నాడు.
‘‘వౌళి ఫీజు, ఇతర ఖర్చులు అన్నీ అందులోంచి కూడా వాడు అన్నయ్య’’ కళ్ళు వాల్చుకుని చెక్కు అన్నయ్యకి అందించాను. చెక్కు అందుకుని పక్క టేబుల్‌మీదపెట్టాడు. ‘‘అలాగేలే! పోయి పడుకో.. రేపాలోచిద్దాం’’ అన్నాడు.
ఆ పని అంత సులువుగా అవుతుందని అనుకోలేదు. అన్నయ్యని ఒప్పించడం అంత సులువు అని నేననుకోలేదు. నాకే ఆశ్చర్యం అనిపించింది. కాని కొంచెం వింతగా కూడా అనిపించింది.
మర్నాడు బ్యాంకునుండి ఫారమ్స్ తెచ్చి నా పేర, తన పేర ఎకౌంటు తెరిపించాడు. ఆ చెక్ అందులో వేయించాడు. ‘‘నీకు కాలసింది నువ్వు వాడుకుంటూ ఉండు. నాకు అవసరమైనపుడు నేను తీసుకుంటాను’’ అన్నాడు. వెనక నుండి అన్నీ చూస్తున్న వదిన, గబగబా అంది నేను గది బయటికి రాంగానే- ‘‘అదేం పని? ఆ డబ్బు మీరు వాడాల్సిన పనేం వుంది, ఇంతకాలం లేంది?’’ అంటూ గట్టిగా అడిగింది.
‘‘కల్యాణి ఆత్మాభిమానం తక్కువగా అంచనా వెయ్యకు’’ అంటున్నాడు అన్నయ్య.
వదిన మరి మాట్లాడలేదు.
మధ్యలో నేను ఎప్పుడు కదిలించబోయినా అన్నయ్య అడ్డుపడేవాడు. నాకు అవసరం రాంగానే వాడతాను. ఎకౌంటులో నాకూ పేరుంది కదా అని. డబ్బు వద్దని మాత్రం ఎప్పుడూ అనేవాడు కాదు. నేను మాత్రం నాకు తోచినట్లు ఇంటి ఖర్చులకు వినియోగిస్తున్నాను.
నా బ్యాంకులోంచి అన్నయ్య మొట్టమొదటిసారి విత్‌డ్రా చేసింది- వౌళికి కాలేజీ ట్యూషన్ ఫీజు కట్టినపుడే.
వౌళి ఇంటర్ పాస్ అయిన సంవత్సరమే మామ్మ నిద్దట్లో వెళ్లిపోయింది. ఆవిడ మరణం చూస్తే ఎవరికీ దుఃఖం రాలేదు, నాన్నగారికి తప్ప. కాని అందరికీ విచారం అనిపించింది. ఏదో ఒక పెద్ద చెట్టు కొమ్మ విరిగినట్లనిపించింది. అందరూ ఏదో మిస్ అయ్యారు. ఆవిడది పరిపూర్ణమైన జీవితం. ఒకటో రెండో తక్కువ 100 ఏళ్ళు బతికింది.
జీవితంలో ఆవిడకు ఎదురైన రిగ్రెట్స్- తాతగారు పోవడం, నా సంసారం అనుకున్నట్లు అవకపోవడం.. అంతకుమించి మరొకటి అనుభవించలేదు. ఆవిడకు నాన్న ఒక్కడే అయినా సంతృప్తిగా మనుమలు, మనుమరాళ్ళు, మునిమనుమలు అందరూ ఉన్నారు. ఆవిడను సాగనంపడానికి అందరూ సకుటుంబంగా వచ్చారు.
ఫ్యామిలీ మెట్రియాక్‌లాగా పంపించారు. కాని, నాన్నను చూస్తే మాత్రం ఆశ్చర్యంవేసింది. తల్లి, బిడ్డల అనుబంధం అంత అపురూపమయినదన్నమాట. మా మామ్మ దృష్టిలో మా నాన్న రిటైర్ అయినా కూడా చిన్నపిల్లవాడే! అలాగే చూచేది.
మా నాన్న చేతిలో ముళ్ళు గుచ్చుకున్నా, ముందు మా మామ్మకే చెప్పుకునేవాడు.
మామ్మ పోవడంతో అనుబంధాలు, ఆప్యాయతలు వాటి విలువలు చాలా అర్థమయ్యాయనిపించింది. ఒక్కొక్కసారి జీవితం అంతా గడిచినా అర్థం కాని విషయాలు, ఒక్కసారి హఠాత్తుగా అర్థమవుతాయి.
వౌళి మద్రాస్‌లో ఐఐటిలో చేరడానికి వెళ్ళాడు. అన్నయ్య స్వయంగా వౌళితోపాటు మద్రాస్ వెళ్ళాడు, వౌళి వద్దని చెప్పినా వినకుండా!
‘‘మామయ్యా! నీకు కూడా చాదస్తం పెరిగిపోతోంది. నేనేం చిన్నపిల్లాడినా?’’ అని చిరాకుపడిపోయాడు.
వౌళిని చూచి నవ్వుతూ ‘‘నీకోసం రావడంలేదురా! నాకు కూడా ఐఐటిని చూడాలని వుంది. ఎంతో గొప్పగా వినడమే కాని, ఎప్పుడూ చూడలేదు’’ అంటూ వెళ్ళనే వెళ్లాడు. నేనూ, వదినా నవ్వుకున్నాం వాళ్ళిద్దరిని చూసి.
వాడు వెళ్ళేటప్పుడు నేను చూపించిన ధైర్యం సడలిపోవడానికి ఎక్కువ టైం పట్టలేదు. సాయంత్రాలు చాలా ఖాళీగా అనిపించసాగాయి. ఇదివరకు అయితే దాదాపు ఇద్దరం ఒకే సమయానికి వచ్చేవాళ్ళం. వాడు పుట్టినప్పటినుంచి ఎప్పుడూ దూరం వెళ్లకపోవడంతో వాడు లేని లోటు బాగా తెలిసేది.
ఒక రోజు చాలా దిగాలుగా ఆనిపించింది. అమ్మ దగ్గరకు వెళ్లి అమ్మను అడిగాను. ‘‘అమ్మా, అన్నయ్య, అక్కలు అంతా చాలా దూరంగా ఉన్నారు కదా, మధ్య మధ్య ఏళ్ళు గడిచిపోతున్నాయి, నీకు బాధ అనిపించడంలేదా అని.
అమ్మ ప్రేమగా, తన చేతులతో నా గడ్డం నిమిరింది. ‘‘వౌళికోసం బెంగ పడుతున్నావా?’’ అడిగింది.
-ఇంకాఉంది

- రమాదేవి చెరుకూరి